వుహాన్‌లో స్నాతకోత్సవం: 11వేల మంది విద్యార్థులు హాజరు - thousends of students gathered in university graduation day in wuhan
close
Published : 17/06/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వుహాన్‌లో స్నాతకోత్సవం: 11వేల మంది విద్యార్థులు హాజరు


(Photo: Shakhwat Hossain facebook)

బీజింగ్‌: ప్రపంచమంతా కరోనా రెండో దశ, మూడో దశ అంటూ భయాందోళనకు గురవుతుంటే చైనాలో మాత్రం తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చేశాయి. ఒకవైపు అన్ని దేశాల్లో ప్రజలు మాస్క్‌లు, భౌతిక దూరం, గుంపులుగా ఉండకూడదంటూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తుంటే.. చైనాలో అవేవీ లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. వైరస్‌ పుట్టుకకు కారణంగా చెబుతున్న వైరాలజీ ల్యాబ్‌ ఉన్న వుహాన్‌లో తాజాగా నిర్వహించిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో 11 వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. అదీ మాస్క్‌లు లేకుండా.. పక్కపక్కనే కూర్చొని. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పది మంది కలిసి ఉన్న చోటకు వెళ్లలేని పరిస్థితులున్న ఈ రోజుల్లో వేలమంది విద్యార్థులతో వుహాన్‌లోని యూనివర్సిటీ వేడుక నిర్వహించడంతో అందరు ఆశ్చర్యానికి గురికావడంతోపాటు అలాంటి పరిస్థితులు మనకు ఎప్పుడు వస్తాయోనని అనుకుంటున్నారు. 

2019లో చైనాలోని వుహాన్‌ తొలి కరోనా కేసు వెలుగుచూసింది. దీంతో నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. కఠినమైన ఆంక్షలు అమలు చేసి కరోనాను నియంత్రించే ప్రయత్నం చేశారు.  క్వారంటైన్‌, కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహించారు. ఇలా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో చైనాలో కరోనా కేసులు ఆదిలోనే తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత చైనా క్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ.. నిబంధనలు సడలిస్తూ వచ్చారు. దేశీయంగా వ్యాక్సిన్‌ ఆవిష్కరించి ప్రజలకు వేగంగా వ్యాక్సిన్‌ ఇచ్చారు. అలా చైనా సాధారణ స్థితిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో వుహాన్‌ యూనివర్సిటీ గతేడాది డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులను, తాజాగా డిగ్రీపూర్తి చేసుకున్న విద్యార్థులను కలిపి స్నాతకోత్సవం నిర్వహించింది. ప్రస్తుతం చైనాలో రోజువారీ కరోనా కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తంగా 91,492 కేసులు నమోదుకాగా.. 86,369 మంది కోలుకున్నారు. 4,636 మంది కరోనాకు బలయ్యారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని