కరోనా టీకా బదులు యాంటీ రేబిస్‌ ఇచ్చేశారు!  - three elderly women given anti-rabies vaccine instead covid-19 vaccine
close
Updated : 09/04/2021 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా బదులు యాంటీ రేబిస్‌ ఇచ్చేశారు! 

విచారణకు ఆదేశం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కొవిడ్‌ టీకా పంపిణీలో ప్రభుత్వ వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం వచ్చిన మహిళలకు యాంటీ రేబిస్‌ టీకా ఇవ్వడం కలకలం రేపింది. వివరాల్లోలోకి వెళ్తే.. దేశ వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్‌ టీ‌కా వేస్తున్న నేపథ్యంలో గురువారం సరోజ్‌ (70), అనార్కలి (72), సత్యవతి (60) కలిసి కండ్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వెళ్లారు. టీకా వేయాలంటే బయటే సిరంజ్‌ కొనుక్కొని రావాలని వైద్య సిబ్బంది చెప్పడంతో అలాగే చేశారు. ఆ తర్వాత టీకా వేసి వారికి రేబిస్ టీకా స్లిప్పులు ఇచ్చి ఇంటికి పంపించేశారు.

కొద్దిసేపటికే సరోజ్‌ అనే మహిళకు మైకం కమ్మడం, మనసులో ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంతో అసలు విషయం బయట పడింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు సీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఇచ్చిన స్లిప్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెకు రేబిస్ టీకా ఇచ్చినట్టు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఉన్నతాధికారులను డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ జస్‌జీత్‌ కౌర్‌‌, వైద్యశాఖ అధికారులు స్పందించారు. ముగ్గురు ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని