వావ్‌.. 220 కిలోలు ఎత్తిన టైగర్‌ష్రాఫ్‌ - tiger shroff gym video goes viral
close
Published : 02/09/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వావ్‌.. 220 కిలోలు ఎత్తిన టైగర్‌ష్రాఫ్‌

ముంబయి: బాలీవుడ్‌ యువ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కండలు తిరిగిన అతడి దేహం చూస్తేనే తెలుస్తుంది. కరోనా ప్రభావంతో షూటింగులు ఆగిపోవడంతో ఇప్పటివరకూ ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకున్నాడు. సినిమాలు నెమ్మదిగా సెట్స్‌పైకి వెళ్లడంతో ఇప్పుడు కసరత్తుల మోతాదు పెంచాడు టైగర్‌. తన ఫిట్‌నెస్‌ స్టూడియోలో భారీగా చెమటలు చిందిస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.

భారీ బరువులు ఎత్తుతూ ఆయన కష్టపడుతున్న తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆయన ఎత్తిన బరువు ఎంతో తెలుసా... ఏకంగా 220 కిలోలట. మొదట ఎత్తడం కష్టమైనా చివరకు కాసేపు ఆ బరువును గాలిలో ఎత్తి ఉంచి సఫలమయ్యాడు. దీనికి టైగర్‌కు అత్యంత సన్నిహితురాలు, బాలీవుడ్‌ నటి దిశాపటానీ చప్పట్లు కొడుతున్న ఎమోజీలను పోస్ట్‌ చేసింది. టైగర్‌ ప్రస్తుతం ‘హీరో పంటి 2’లో నటిస్తున్నారు. తర్వాత ‘రాంబో’లో నటించనున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని