vande mataram: గాయకుడిగా మారిన బాలీవుడ్‌ హీరో - tiger shroff sings for a new patriotic anthem vande mataram
close
Published : 06/08/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vande mataram: గాయకుడిగా మారిన బాలీవుడ్‌ హీరో

ముంబయి: కండలు తిరిగిన దేహంతో పోరాటాలు, అదిరిపోయే డ్యాన్స్‌లు, అబ్బురపరిచే ఫీట్స్‌తో అలరిస్తుంటాడు బాలీవుడ్‌ యువ కథానాయకుడు టైగర్ ష్రాఫ్‌.  కేవలం నటన, ఫిట్‌నెస్‌కి మాత్రమే పరిమితమైపోలేదు ఈ 31ఏళ్ల నటుడు.  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాయకుడిగా మారి తన స్వరాన్ని వినిపించనున్నాడు. ‘వందేమాతరం’ అనే పాటతో మ్యూజిక్‌ వీడియోని రూపొందించి దేశానికి కానుకగా ఇవ్వనున్నాడు. ఇదే విషయాన్ని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు.

‘‘జీవితంలో ఇలాంటి పాట పాడటం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది.. కాస్త భయంగానూ ఉంది. ‘వందేమాతరం’ అనేది కేవలం పాట మాత్రమే కాదు. ఒక ఎమోషన్‌. ఇలాంటి ప్రత్యేక పాటను పాడి దేశానికి అంకితమివ్వడం, మీతో పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ఆగస్టు10 (మంగళవారం) ఈ మ్యూజిక్‌ వీడియోని విడుదల చేయబుతున్నాం’’ అని పోస్టు చేశారు. దీనికి రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తుండగా.. విశాల్‌ మిశ్రా సంగీతాన్ని సమకూరుస్తున్నారు, కౌశల్‌ కిశోర్‌ సాహిత్యాన్ని అందించారు. 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని