టైగర్‌ సరసన సారా - tiger team ups with sara for baaghi 4
close
Published : 31/03/2021 10:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైగర్‌ సరసన సారా

బాలీవుడ్‌ యువ కండల వీరుడు టైగర్‌ ష్రాఫ్‌ ‘బాగీ’ సిరీస్‌ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. అందులో భాగంగానే ‘బాగీ 4’ రానుంది. ఇందులో నాయికగా సారా అలీఖాన్‌ను ఎంపిక చేసుకున్నారట. ఈ చిత్ర నిర్మాత షాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ‘హీరోపంటి 2’ కోసం ముందుగా సారానే అనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆ స్థానం తారా సుతారియాకు దక్కింది. అందుకే ‘బాగీ 4’లో సారాను తీసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. బాగీ సిరీస్‌లో ఎప్పటికప్పుడు కొత్త నాయికలే సందడి చేస్తున్నారు. ‘హీరోపంటి 2’ చిత్రీకరణ పూర్తి కాగానే ‘బాగీ 4’ కోసం రంగంలోకి దిగనున్నారు టైగర్‌. సారా ప్రస్తుతం ‘అతరంగీరే’, ‘ఇమ్మెర్టల్‌ అశ్వత్థామ’ చిత్రాలతో బిజీగా ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని