దేశమంతా విస్తరిస్తాం.. భాజపాను ఢీకొడతాం - tmc to spread footprint across india will take bjp head-on wherever possible: abhishek banerjee
close
Published : 08/06/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశమంతా విస్తరిస్తాం.. భాజపాను ఢీకొడతాం

కోల్‌కతా: దేశంలోని ప్రతిమూలకూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కొన్ని నెలల్లో సిద్ధం చేయబోతున్నట్లు తెలిపారు. తాను ఎదగాలని భావిస్తున్న ప్రతి రాష్ట్రంలోనూ భాజపాను తృణమూల్‌ ఢీకొడుతుందని చెప్పారు. ఈ మేరకు అభిషేక్‌ బెనర్జీ మీడియాతో మాట్లాడారు.

భాజపా చేస్తున్న బంధుప్రీతి ఆరోపణలను అభిషేక్‌ ఖండించారు. ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లో ఉండాలని ఒకవేళ పార్లమెంటులో చట్టం చేస్తే పార్టీ నుంచి వెంటనే వైదొలుగుతానని పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లలో ఏ మంత్రి పదవినీ చేపట్టబోనని, పార్టీని వృద్ధిలోకి తీసుకురావడమే తన ముందున్న లక్ష్యమని వివరించారు. బెంగాల్‌లో భాజపాను ఓడించినందుకు తృణమూల్‌ను అభినందిస్తూ దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఈ-మెయిల్స్‌ వచ్చాయని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని