మోహన్‌బాబు గర్జన.. ట్యూన్‌ కష్టమన్న ఇళయరాజా - to produce a movie with legends is a god sent opportunity for me says manchu vishnu
close
Published : 20/02/2021 23:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోహన్‌బాబు గర్జన.. ట్యూన్‌ కష్టమన్న ఇళయరాజా

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌బాబు డైలాగ్‌ డెలివరీ గురించి మనందరికీ తెలిసిందే. అందుకే ఆయన డైలాగ్‌కింగ్‌ అయ్యారు. అయితే.. మోహన్‌బాబు చెప్పిన డైలాగ్‌కు ట్యూన్‌ కట్టడం కష్టమైన పని అంటున్నారు మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో మోహన్‌బాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.

కాగా.. మోహన్‌బాబు ఈ సినిమాలోని 11వ శతాబ్దం నాటి గర్జనను ఇళయరాజాకు వినిపించారు. వెంటనే.. ఇళయరాజా స్పందిస్తూ.. ‘ఇంత కఠినంగా ఉంది. ఇది పూర్తిగా గద్యం. మీరు పాటలా పాడుతారా..? దీనికి ట్యూన్‌ చేయడం చాలా కష్టం’ అని అన్నారు. అయితే.. ‘మీరే చేయగలరు. మీకు సాధ్యం కానిదేదీ లేదు’ అని మోహన్‌బాబు అన్నారు. వీళ్లతో పాటు డైరెక్టర్‌ రత్నబాబు కూడా ఉన్నారు. ఈ సంభాషణను వీడియో తీసి మంచు విష్ణు తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. ‘దిగ్గజాలతో సినిమా నిర్మించడం నాకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఒక గద్యాన్ని పాటగా మలచడం కేవలం లెజెండ్స్‌కు మాత్రమే సాధ్యం’ అంటూ రాసుకొచ్చాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని