olympics: ఘనంగా టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక! - tokyo olympics started officially
close
Updated : 23/07/2021 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

olympics: ఘనంగా టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక!

టోక్యో: ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథులు, ప్రేక్షకుల మధ్య వేడుకను నిర్వహించారు. భారీ సంఖ్యలో క్రీడాభిమానులు లేకున్నా.. బాణాసంచా పేల్చి.. నృత్యప్రదర్శనలు, లైట్‌షో నిర్వహించి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నడిపించారు. వేడుకలో భాగంగా పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు వారి జాతీయ పతాకంతో మార్చ్‌లో పాల్గొన్నారు. భారత అథ్లెట్లు కూడా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ మార్చ్‌ఫాస్ట్‌ చేశారు. పురుషుల తరఫున హాకీ జట్టు స్కిప్పర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మహిళల తరఫున  బాక్సర్‌ మేరికోమ్‌ భారత అథ్లెట్లను ముందుండి నడిపించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జపాన్‌ చక్రవర్తి నరుహిటో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, యూఎస్‌ ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ హాజరయ్యారు. 

ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకల ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని