Tokyo Olympics: ఒలింపిక్‌ నగరంలో కరోనా రికార్డులు..! - tokyo records 3000 covid cases
close
Updated : 28/07/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: ఒలింపిక్‌ నగరంలో కరోనా రికార్డులు..!

టోక్యో: ఒలింపిక్ క్రీడల వేదిక టోక్యోలో కరోనా విజృంభిస్తోంది. ఈ నగరంలో తాజాగా 3,177 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి ఆ దేశంలోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి టోక్యో నగరంలో మూడువేలకు పైగా కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ముందురోజు 2,848 మందికి పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. జనవరి 7న నమోదైన అత్యధిక కేసులు 2,520 కన్నా ఈ రెండురోజులు ఎక్కువ కేసులు వచ్చాయి. ఒకవైపు ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులు ఒలింపిక్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. వైరస్ కేసులు పెరుగుతుండటం స్థానిక యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. 

మేం భయపడినట్లే కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని టోక్యోకు సమీపంలోని కనగవా గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నగరవాసిగా, నిర్వాహకుడిగా కేసుల్లో పెరుగుదల తీవ్రంగా కలవరపెడుతోందని టోక్యో ఒలింపిక్స్ ప్రతినిధి మాసా తకయా మీడియాతో అన్నారు. మరోపక్క క్రీడలకు సంబంధించి తాజాగా 16 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో జులై 1 నుంచి ఇప్పటివరకు 169 మందికి వైరస్ సోకింది. ఇంకోపక్క జపాన్‌లో కరోనా టీకా కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఇవన్నీ కలిసి అక్కడి ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేస్తున్నాయి. పౌరుల ఆరోగ్యం కంటే ఒలింపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాని యోషిహిదే సుగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆ టోక్యో నగరంలో ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని