ప్రిన్స్‌.. లవర్‌ బాయ్‌ టు కండల వీరుడు - tollywood actor prince workout videos
close
Updated : 20/06/2021 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రిన్స్‌.. లవర్‌ బాయ్‌ టు కండల వీరుడు

లక్‌ కోసం చెమటోడుస్తున్న హీరో

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోల్లో ప్రిన్స్‌ ఒక్కరు. అమాయకపు లుక్స్‌తో మొదటిసారి వెండితెరపై మెరిసిన ఈ హీరో.. ‘బస్‌స్టాప్‌’, ‘రొమాన్స్‌’ వంటి చిత్రాలతో లవర్‌ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హీరోగా మాత్రం ఆయనకు అనుకున్న విజయం వరించలేదు. దీంతో ప్రిన్స్‌ పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించారు. కాగా, ప్రస్తుతం ఆయన లవర్‌బాయ్‌ లుక్‌ నుంచి కండల వీరుడిగా మారారు. సినిమాల్లో అవకాశాలు పొందేందుకు జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ఇటీవల తన న్యూలుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ప్రిన్స్‌.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ క్రమంలో ఆయన జిమ్‌ వర్కౌట్లకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో  తెగ చక్కర్లు కొడుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని