హీరోలు.. విలన్స్‌ అయితే...  - tollywood actors intersted to do villain characters
close
Updated : 01/09/2020 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హీరోలు.. విలన్స్‌ అయితే... 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ నటుడికైనా మంచి పాత్రలు చేయాలని, కథాబలమున్న చిత్రాల్లో నటించాలని ఉంటుంది. ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసే కథానాయకులు ఎందరో ఉన్నారు. ప్రతి నటుడికి జీవితంలో మర్చిపోలేని కొన్ని పాత్రలు వస్తాయి. అలా వచ్చి వాటిని అందిపుచ్చుకుని నటిస్తే, అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. వీటిల్లో ప్రతినాయకుడి పాత్రలు కూడా ప్రత్యేకమే. హీరోలు.. విలన్‌లా మారడం తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. గతంలోనే ఎంతోమంది హీరోలు ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు యువ కథానాయకుడు నాని ప్రతినాయకుడిగా మెప్పించేందుకు సిద్ధమయ్యారు.

నాని కీలక పాత్రలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం ‘వి’. సుధీర్‌బాబు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అదితిరావు హైదరీ, నివేదా థామస్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకూ పక్కంటి కుర్రాడిలా, అల్లరి ప్రేమికుడిగా అలరించిన నాని ‘వి’లో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌లో ఆయన చూసి అభిమానులు మరింత ఉత్సుకతకు గురవుతున్నారు. ప్రతినాయకుడిగా స్క్రీన్‌పై నాని నటన ఎలా ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నాని ఎందుకు ప్రతినాయకుడిగా మారాల్సి వచ్చింది? ‘నేచురల్‌ స్టార్‌’గా పేరున్న నాని ఆ పాత్రలో ఎలా ఒదిగిపోయాడు? తెలియాంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

ఆ హీరోలందరూ విలన్‌లు అయ్యారు

హీరోలు ప్రతినాయకుడి పాత్రలు కొత్తేమీ కాదు. అరుదుగా వచ్చే ఇలాంటి అవకాశాన్ని మన హీరోలు చాలామంది సద్వినియోగం చేసుకున్న వారే. అయితే, ఇటీవల కాలంలో యువ హీరోలు ఇలాంటి పాత్రలకు సై అంటున్నారు. భగ్న ప్రేమికుడిగా ‘ఆర్‌ఎక్స్‌ 100’లో అలరించిన నటుడు కార్తికేయ నానితో తలపడ్డాడు. ‘గ్యాంగ్‌ లీడర్‌’ కోసం ప్రతినాయకుడిగా మారాడు. ‘బాద్‌షా’ కోసం నవదీప్‌, ‘అజ్ఞాతవాసి’, ‘సరైనోడు’ కోసం ఆది, ‘అరవింద సమేత’లో నవీన్‌ చంద్ర ఇలా పలువురు నటులు ప్రతినాయకులుగా మెప్పించారు. ఇటీవల హాస్యనటుడు సునీల్‌ కూడా ప్రతినాయకుడిగా అలరించారు. రవితేజ నటించి డిస్కోరాజా కోసం ఆయన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దర్శకులు కొత్త కథలు సిద్ధం చేస్తున్నారు. దీంతో మరికొందరు నటులు విభిన్న, ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో తప్పకుండా అలరించే అవకాశం ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని