బన్నీ విద్యార్థి నాయకుడు అవుతాడా? - tollywood buzz says bunny will act as a student leader in koratala shiva movie
close
Published : 27/07/2020 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ విద్యార్థి నాయకుడు అవుతాడా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ సినిమా అంటే... మాంచి డ్యాన్సులు, అదిరిపోయే ఫైట్లు, చూడచక్కని స్టైల్‌ ఆశిస్తారు. అదే కొరటాల శివ అంటే సమాజానికి సందేశం తప్పక ఉంటుంది. దానికి ఆయన స్టయిల్‌లో మాస్‌ పాళ్లు కలిపే సిద్ధం చేస్తాడు. వీరిద్దరూ కలసి చేస్తున్న సినిమా అనేసరికి ఎలా ఉంటుందా అనే అంచనాలు మొదలయ్యాయి. ఫలానా కథ, నేపథ్యమిదీ అంటూ వార్తలొస్తున్నాయి. అయితే వేటి విషయంలోనూ ఎలాంటి స్పష్టత రావడం లేదు. తాజాగా బన్ని- కొరటాల సినిమా గురించి మరో న్యూస్‌ బయటకు వచ్చింది.

చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్న కొరటాల శివ... దాని తర్వాత అల్లు అర్జున్‌తో జట్టు కట్టబోతున్నాడని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో బన్ని సినిమా కథపై కూర్చున్నాడట కొరటాల. ఇప్పటికే సినిమా ప్లాట్‌ మీద ఓ అవగాహనకు వచ్చేశారని టాలీవుడ్‌ టాక్‌. తాజా భోగట్టా ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్‌ విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడట. అంటే ఈ సారి కొరటాల చూపు విద్యార్థి రాజకీయాలపై పడిందన్నమాట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే... బన్నీని విద్యార్థి నాయకుడిగా చూస్తాం.

ఈ ఏడాది మొదట్లో ‘అల వైకుంఠపురములో’తో భారీ విజయం అందుకున్న బన్నీ... ఆ ఆనందాన్ని ఎంజాయ్‌ చేస్తుండగానే లాక్‌డౌన్‌ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్త కథలు వింటున్నాడు. అంతకుముందే అంతా సెట్‌ అయిన ‘పుష్ప’ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. కరోనా ప్రభావం తగ్గాక ఆ సినిమా పూర్తి చేసి... కొరటాల సినిమా సెట్‌లోకి ప్రవేశిస్తాడని తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని