Super Deluxe: ఇక ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ట్రైలర్‌ వచ్చేసింది! - tollywood cinema news super deluxe telugu trailer
close
Updated : 03/08/2021 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Super Deluxe: ఇక ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ట్రైలర్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒక చిత్రం కోసం మాత్రం తెలుగు సినీ అభిమానులు ఎంతగానో వేచి చూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు ఫలితం ఆగస్టు 6న రానుంది. అదే ‘సూపర్‌ డీలక్స్‌’. తమిళంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న చిత్రమిది. విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 6న ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకేసారి జరిగే వేర్వేరు సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఆద్యంతం అలరించేలా త్యాగరాజన్‌ కుమారరాజా దీన్ని తెరకెక్కించారు. విజయ్‌ సేతుపతి, సమంత, ఫహద్‌ఫాజిల్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అసలు ఈ నలుగురు జీవితాల్లో ఏం జరిగింది? ఆ పరిస్థితుల నుంచి వాళ్లెలా బయటపడ్డారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అప్పటి వరకూ ఈ ట్రైలర్‌ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని