‘భూదాన్‌ ఉద్యమం’పై నీలకంఠ సినిమా - tollywood director neelakanta new movie update
close
Published : 11/09/2021 23:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ‘భూదాన్‌ ఉద్యమం’పై నీలకంఠ సినిమా


పేదరికంలో మగ్గిపోతున్న దేశప్రజలకు భూములను పంచిపెట్టిన భూదానోద్యమం ఎందరో జీవితాల్లో వెలుగులు తెచ్చింది. ఈ ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోబాభావే అడిగిన వెంటనే 100 ఎకరాల భూమిని  దానం చేసేందుకు ముందుకొచ్చారు వెదిరె రామచంద్రరాడ్డి. అలా ఒక్క రక్తపు బొట్టు చిందంచకుండా 58  లక్షల ఎకరాలను నిరుపేదలకు చేరేందుకు స్ఫూర్తినిచ్చిన దాత రామచంద్రారెడ్డి. ఆయన జీవితంపై ఇప్పుడొక సినిమా తెరకెక్కబోతోంది.  దీన్ని ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ నీలకంఠ తెరకెక్కించనున్నారు. రామచంద్రరెడ్డి మనవడు చంద్రశేఖర్‌ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటి భూదాతగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని సినిమాగా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఇది కమర్షియల్‌ సినిమా కాదు, అలాగని డాక్యుమెంటరీగా మలచలేము. చాలా జాగ్రత్తగా తెరకెక్కించాల్సిన సినిమా. ఈ చిత్రం కోసం శాయశక్తులా కృషి చేస్తాను’ అన్నారు. శనివారం వినోబాభావే 127వ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో  దర్శకుడు నీలకంఠ, నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి, చిత్ర సమర్పకులు అరవింద్ రెడ్డి, ప్రమోద్ చంద్ర రెడ్డి, మహాదేవ్ విద్రోహి, సహా నిర్మాతలు గడ్డం రవి, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని