Corona: టాలీవుడ్‌ యువ దర్శకుడు మృతి - tollywood young director dies due to covid19
close
Updated : 01/05/2021 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: టాలీవుడ్‌ యువ దర్శకుడు మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రక్కసికి మరో డైరెక్టర్‌ బలయ్యారు. యువ దర్శకుడు వట్టి కుమార్‌ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 2017లో శ్రీవిష్ణు హీరోగా ‘మా అబ్బాయి’ సినిమాను డైరెక్టర్‌ కుమార్‌ తెరకెక్కించారు. మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా.. ఇటీవల కరోనా కారణంగా ‘సర్కారువారి పాట’ చిత్రీకరణ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమార్‌కు కరోనా సోకిందట. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా.. పలువురు సినీ ప్రముఖులు కుమార్‌ మృతిపై విచారం వ్యక్తం చేశారు. టాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖులు కరోనాతో పోరాడుతున్నారు. పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, పూజాహెగ్డేకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయం అందిరికీ తెలిసిందే. అంతేకాదు.. దిల్‌రాజు, బండ్ల గణేశ్‌, నివేదా థామస్‌ ఇలా ఎంతోమంది తారలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని