Narendra Giri: మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి.. శిష్యుడి అరెస్టు - top seer mahant narendra giri found dead at muth
close
Updated : 21/09/2021 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Narendra Giri: మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి.. శిష్యుడి అరెస్టు

ప్రయాగ్‌రాజ్‌: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లోని బాఘంబరి మఠంలోని అతిథి గృహంలో పైకప్పునకు వేలాడుతూ ఆయన మృతదేహం కనపడిందని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కె.పి.సింగ్‌ వెల్లడించారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన శిష్యులు ఫోన్‌ చేయడంతో తాము అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ఆ గదిలో 8 పేజీల లేఖ ఒకటి లభించిందని, అది మహంత్‌ నరేంద్ర రాసినదిగా భావిస్తున్నామని తెలిపారు. మానసికంగా తీవ్ర కలతకు గురైన తాను జీవితాన్ని ముగిస్తున్నట్లు అందులో రాసి ఉందన్నారు.

తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే ఆశ్రమంలోని శిష్యులను విచారించగా.. పలు అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నరేంద్రకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే ఆనంద్‌ గిరి అనే శిష్యుడు.. గతంలో ఆశ్రమంలో మోసాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిని ఆశ్రమం నుంచి బయటకు పంపేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆనంద్ గిరి మళ్లీ నరేంద్ర వద్దకు వచ్చి క్షమించమని కోరడంతో తిరిగి ఆశ్రమంలో చేర్చుకున్నట్లు తెలిసింది.

శిష్యుడి అరెస్టు..

కాగా.. నరేంద్ర గిరిని ఆనంద్‌ పలుమార్లు వేధించాడని ఆశ్రమంలోని కొందరు పోలీసులకు తెలిపారు. ఆయన మరణించిన గది ముందు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దీని ఆధారంగా ఆనంద్‌ను పోలీసులు అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు నరేంద్ర గిరిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతిపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

నివాళులర్పించిన సీఎం యోగి..

నరేంద్ర గిరి మృతదేహాన్ని ప్రజల దర్శనార్థం ఆశ్రమంలో ఉంచారు.  అటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌ చేరుకుని నరేంద్రగిరి పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మహంత్‌ మృతిపై దర్యాప్తు జరుగుతోందని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా నివాళులర్పించనున్నారు. 

దేశంలోనే అతిపెద్దదైన సాధువుల పరిషత్‌కు నరేంద్ర నాయకత్వం వహిస్తున్నారు. మహంత్‌ నరేంద్ర ఆకస్మిక మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్, పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని