Top Ten News @ 1 PM - top ten news at 1 pm
close
Updated : 29/05/2021 13:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM

1. Corona: 99% వైరల్‌ లోడు తగ్గించే నాసల్‌ స్ప్రే 

కరోనా రెండో ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ టీకా కార్యక్రమాన్ని విస్తరించి, పిల్లలు, తక్కువ ముప్పు ఉన్న వర్గాలకూ వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. ప్రస్తుతమున్న కరోనా వైరస్‌ రకాలను ఎదుర్కొనేలా తమ డోసుల సమర్థతను పెంచేందుకు టీకా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ముక్కులో వేసే నాసల్‌ స్ప్రేల రాకతో.. ఈ మహమ్మారిపై పోరు కొత్త మలుపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలం కాదు

తిరుమల గిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలంగా తితిదే ప్రకటించడాన్ని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామిజీ తప్పుపట్టారు. హనుమంతుని జన్మస్థలంపై తితిదే కమిటీ ప్రకటన, తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తితిదే పండిత పరిషత్‌ అచ్చు వేయించిన పుస్తకంలో హనుమంతుని జన్మస్థలానికి ఆధారంగా ఉటంకించిన శ్లోకాలను వాటి ప్రమాణాల్ని తోసిపుచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. European Union:12-15 ఏళ్ల పిల్లలకు ఫైజర్‌ టీకా!

12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఐరోపా సమాఖ్య(ఈయూ) పచ్చజెండా ఊపింది. యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ) సలహా కమిటీ సిఫార్సుల మేరకు టీకా వినియోగానికి ఈయూ ఆమోదం తెలిపింది. ఈయూ సభ్యదేశాల్లో ఇప్పటికే 16 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతి ఉంది. తాజాగా 12-15 ఏళ్ల మధ్య వయసు వారికి కూడా టీకా అందించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టీకా తీసుకోండి.. ₹840 కోట్లు గెలుచుకోండి! 

4. సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు భ‌ద్ర‌త‌తో కూడిన మ‌దుపు

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ప్ర‌భుత్వ‌ప‌రంగా ఇక్క‌డ 3 మెరుగైన, భ‌ద్రత‌తో కూడిన పెట్టుబ‌డి ప‌థ‌కాలున్నాయి. మార్కెట్‌లోని కొన్ని ఆర్థిక ప‌థ‌కాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వారి పెట్టుబ‌డుల‌పై అధిక భ‌రోసాతో కూడిన రాబ‌డికి మాత్ర‌మే ప‌రిమితం కాకుండా, నెల‌వారీ ఆదాయంతో ఎక్కువ ప‌న్ను మిన‌హాయింపుల‌ను కూడా అందిస్తాయి. వారి అవ‌స‌రాన్ని బ‌ట్టీ ఏదో ఒక ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌చ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Narada Case: నారదా కేసులో నవ్వుల పాలయ్యాం 

నారదా కుంభకోణం కేసులో కోల్‌కతా హైకోర్టు వ్యవహరించిన తీరుపై సాక్షాత్తూ ఓ న్యాయమూర్తే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం న్యాయవర్గాలను దిగ్భ్రమ కలిగించింది. ఈ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసే విషయమై అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఇలా చేయడం ద్వారా నవ్వుల పాలయ్యామని అభిప్రాయపడుతూ న్యాయమూర్తి జస్టిస్‌ అరిందమ్‌ సిన్హా తోటి న్యాయమూర్తులకు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా పరీక్షలకు ఇక సులువైన విధానం!

కొవిడ్‌ అనుమానితుల నుంచి నమూనాల (శ్వాబ్‌)ను సేకరించి, ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష కోసం సిద్ధం చేయడానికి భారత శాస్త్రవేత్తలు ఒక సులువైన, వేగవంతమైన విధానాన్ని కనుగొన్నారు. మౌలిక వసతులు పెద్దగా లేని గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి దీనివల్ల వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలోని ‘నేషనల్‌ ఎన్విరానిమెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (నీరి) శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

corona: దేశంలో కేసులు తగ్గుతున్నాయ్‌..

7. రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు

కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో ఆయన్ను తరలించారు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Crime: నడిరోడ్డుపై  వైద్య దంపతుల దారుణ హత్య

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ డాక్టర్‌ దంపతులను అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ సందీప్‌ గుప్తా ఆయన భార్య డాక్టర్‌ సీమా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం తమ కారులో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌ వచ్చి అడ్డుకున్నారు. అనంతరం ఒక వ్యక్తి బైక్‌ దిగి నేరుగా కారు దగ్గరకు వెళ్లాడు. సందీప్‌ కారు అద్దాన్ని దించిన వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో ఆ దంపతులపై కాల్పులు జరిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Tollywood Movies: తారుమారు అయ్యాయి!

 ఓ అగ్ర కథానాయకుడు, ఓ అగ్ర దర్శకుడు కలిసి కొత్త చిత్రం ప్రకటించడమే ఆలస్యం సినీ అభిమానుల్లో సందడి మొదలవుతుంది. ఆ కాంబినేషన్‌పై మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? నాయిక ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? అనే ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటిలానే ఇటీవల మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ విషయంలోనూ ఇదే జరిగింది. కానీ చిన్న మార్పు చోటు చేసుకుంది. అదేంటంటే.. ముందుగా ప్రటించిన సినిమాని కాస్త వెనక్కి పెట్టి మరో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Puri Musings: ఆ దేశాల్లో పుడితే ఆందోళ‌న ఉండ‌దు

10. Sourav Ganguly: వన్డేల్లో.. ఒకే ఒక్కడు!

పరుగులు చేయడంలో.. సిక్సర్లు దంచడంలో.. ప్రత్యర్థిని ఢీకొట్టడంలో కోల్‌కతా ప్రిన్స్‌ ఆధిపత్యం తెలియనిది ఎవరికి? మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కళంకంతో విశ్వాసం కోల్పోయిన భారత క్రికెట్‌కు ఊపిరులూదిన బెంగాల్‌ టైగర్‌ సంగతి తెలియనిది ఎవరికి? అయితే, అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా నాలుగు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచులు గెలిచిన ఏకైక క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ ఒక్కడేనని ఈ తరంలో ఎంతమందికి తెలుసు? అందుకే అప్పటి దాదాగిరిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం!! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని