Top Ten News @ 1 PM - top ten news at 1 pm
close
Updated : 31/05/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM

1. AP News: రిటైర్డ్‌ హెచ్‌ఎం కోటయ్య మృతి

నెల్లూరు జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతిచెందారు. కరోనా సోకడంతో పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్‌లో ఆయన చేరారు. గత నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. కరోనా సోకిన తర్వాత కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధాన్ని కోటయ్య తీసుకున్నారు. అనంతరం కోలుకున్నట్లు గతంలో ఆయన ప్రకటించారు. ఆ తర్వాత కోటయ్యకు ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఈరోజు మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Wuhan: ఇలా అయితే, కొవిడ్‌-26, కొవిడ్‌-32 తప్పవు!

దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా మూలాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. కాల గమనంలో ఈ మహమ్మారి పుట్టుకపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కొందరు వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకొచ్చిందని వాదిస్తుండగా.. మరికొందరేమో ప్రకృతి నుంచే సహజంగా పుట్టుకొచ్చిందంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా వుహాన్‌ ల్యాబ్‌ థియరీని బలపరుస్తూ పలు సంస్థలు, నిపుణులు కథనాలు ప్రచురిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Coronavirus: కొవిడ్‌కు ‘విశ్వాస’ పరీక్ష! 

3. Petrol: 16 రోజుల్లో రూ. 4 పెంపు 

మే నెలలో ఎండ వేడితో పాటు ఇంధన ధరలు మండిపోయాయి. వరుస పెంపులతో వినియోగదారుల గుండెలు గుబేలన్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్‌ ధర ఏకంగా సెంచరీ దాటేయడంతో వాహనం బయటకు తీయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నెలలో చమురు సంస్థలు 16 సార్లు  ఇంధన ధరలను పెంచాయి. మొత్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ. 4 వరకు పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
4. AP News: పేద‌వాడికి కార్పొరేట్‌ వైద్యమే లక్ష్యం: జ‌గ‌న్

పేద‌వాడికి వైద్య సేవ‌ల‌ను మ‌రింత అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 14 వైద్య‌కళాశాల‌ల నిర్మాణ ప‌నుల‌కు తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైద్య క‌ళాశాల‌ల కోసం రూ.8 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. వీటికి అనుబంధంగా న‌ర్సింగ్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. corona:4వరోజు..2లక్షలలోపే కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరసగా నాలుగు రోజులుగా రోజూవారీ కేసులు రెండులక్షల దిగువనే నమోదయ్యాయి. రికవరీరేటు ఊరటనిస్తోంది. క్రియాశీలరేటు తగ్గుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Covid: ధూమపానంతో కరోనా ముప్పు అధికం

6. Mamata Banerjee: కేంద్రం, దీదీ మధ్య ‘తుపాను’ చిచ్చు  

యస్‌ తుపాను సమీక్షా సమావేశం..మరోసారి కేంద్రం, దీదీ మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వ కార్యదర్శిని తక్షణమే రిలీవ్ చేయాలంటూ రెండు రోజుల క్రితం కేంద్రం ఆదేశించగా..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన శైలిలో ఆ ఆదేశాలను ధిక్కరించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన్ను రిలీవ్ చేయడం కుదరదని చెప్తూ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Bollywood: ప్రేయసి కోసం రూ.23 కోట్లు

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ అర్జున్‌కపూర్‌-మలైకా అరోరా మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచారు. తన ప్రేయసి మలైకాకు అత్యంత చేరువలో ఉండాలనే ఉద్దేశంతో అర్జున్‌కపూర్‌ బాంద్రాలో ఓ సరికొత్త విల్లాను కొనుగోలు చేశారట. ప్రస్తుతం తన సోదరితో కలిసి ముంబయిలోని ఓ ప్రాంతంలో నివాసముంటున్న అర్జున్‌కపూర్‌ తాజాగా బాంద్రాలో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరూ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలో గల ఈ విల్లా కోసం అర్జున్‌ సుమారు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. UP: బాబ్బాబూ! జైల్లోనే ఉండనివ్వండి

‘ఇల్లే కదా స్వర్గసీమ’ అని పాడుకోవడం విన్నాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆ ఖైదీలు మాత్రం బెయిలు ఇస్తాం ఇళ్లకు వెళ్లండంటే.. బాబ్బాబూ! జైల్లోనే ఉండనివ్వండంటూ ప్రాధేయపడుతున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు కరోనా వేళ జైలు కంటే సురక్షితం, ఆరోగ్యప్రదం మరొకటి లేదంటూ.. పెరోల్‌ (తాత్కాలిక విడుదల) తమకు వద్దని ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సెంట్రల్‌ విస్టా.. అత్యవసరమైన ప్రాజెక్టు

కొవిడ్‌ ఉద్ధృతి వేళ పార్లమెంట్‌ నూతన భవన సముదాయం సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులు కొనసాగిస్తుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న వేళ.. దీనిపై దిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది అని పేర్కొన్న న్యాయస్థానం.. సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Sachin Tendulkar: సచిన్.. యుగానికి ఒక్కడు!

అంతర్జాతీయ క్రికెట్‌కు దిగ్గజాలను అందించిన దేశం భారత్‌. ఎంతోమంది మ్యాచ్‌ విజేతలు టీమ్‌ఇండియా నుంచి వచ్చారు. అద్భుతమైన ఆటతో అలరించారు. అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ఉత్కంఠకరమైన మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించి ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’లు కైవసం చేసుకున్నారు. వందల మంది జట్టుకు ఆడితే కొందరికే ఎక్కువ పురస్కారాలు దక్కాయి. ఇంతకీ వాళ్లెవరంటే..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Virat Kohli: ఆ నలుగురు ఉండగా ఒత్తిడేలా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని