Top Ten News @ 1 PM - top ten news at 1 pm
close
Updated : 05/07/2021 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM

1. పరీక్షల వాయిదా పిటిషన్‌కు టీఎస్‌ హైకోర్టు నో

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల వాయిదాపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయడానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నించారు. పిటిషన్‌ స్వీకరణకు అనుమతి కోరగా.. స్పందించిన హైకోర్టు పరీక్షల అంశాన్ని అత్యవసర విచారణకు నిరాకరించింది. చివరి నిమిషం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: సబితా ఇంద్రారెడ్డి నివాసం ముట్టడి

2. మెహ్రీన్‌ని ప్రేమించా కానీ.. : భవ్య బిష్ణోయ్‌

మెహ్రీన్‌ని తాను ఎంతగానో ప్రేమించానని హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా పెళ్లిని కొంతకాలం వాయిదా వేస్తున్నామని అప్పట్లో మెహ్రీన్‌ వెల్లడించారు. అయితే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మెహ్రీన్‌ తాజాగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఇకపై భవ్య, వాళ్ల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Prison: ఖైదీలతోనే విచ్చలవిడి శృంగారం

ఆమె ఖైదీల్లో మార్పులు తేవాల్సిన అధికారి. వారు తప్పు చేస్తే కౌన్సెలింగ్‌ ఇచ్చి మంచి మార్గంవైపు నడిపించాలి. అలాంటి ఆమే.. నిబంధనలు గాలికి వదిలి ఖైదీలతో బహిరంగ శృంగార కార్యకలాపాలు చేస్తూ జైల్లో విచ్చలవిడిగా ప్రవర్తించింది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రెస్నో కౌంటీలోని సవరణ అధికారిణి టీనా గొంజాలెజ్‌ (26)కు న్యాయస్థానం రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలు శిక్ష విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* UP: విడిపోయిన భార్యే సవతి తల్లి..!

4. CBSE: ‘పది’ ఫలితాలు ఆ రోజేనా?

పదో తరగతి ఫలితాల వెల్లడికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా పాఠశాలల నుంచి మార్కులు తెప్పించుకున్న సీబీఎస్‌ఈ.. జులై 20న ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల ఎదురుచూపునకు తెరపడనుంది. ఫలితాలు వెల్లడి అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను cbseresults.nic.in లేదా cbse.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Petrol: 2 నెలల్లో పెట్రోల్‌ ధర ఎంత పెరిగిందంటే..?

పెట్రోల్‌ ధరల నుంచి సామాన్యుడికి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా కన్పించట్లేదు. నిరంతర ప్రక్రియలా మారిపోయిన పెట్రో ధరల బాదుడుతో బండి బయటకు తీయాలంటేనే వాహనదారుడి గుండె  గుబేలుమంటోంది. రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఈ రెండు నెలల కాలంలో పెట్రోల్‌పై దాదాపు రూ.10 వరకు పెరగడం గమనార్హం. అటు డీజిల్‌ కూడా దాదాపు రూ.9 పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* OPEC: మరో సంక్షోభం ముంగిట ఒపెక్‌?

6. Corona: మరోసారి..40 వేల దిగువకు కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఆదివారం 39,796 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేసులు క్రితంరోజు కంటే 7.6 శాతం క్షీణించడంతోపాటు మరోసారి 40 వేల దిగువకు పడిపోయాయి. 24 గంటల వ్యవధిలో 723 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3,05,85,229కి చేరగా.. మృతుల సంఖ్య 4,02,728గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 15,22,504 మంది నమూనాలను పరీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. TS News: సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల బలి

ల్ఫీ సరదా ముగ్గురు బాలికలను బలిగొన్న ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. తానూర్‌ మండలం సింగన్‌గావ్‌లో చెరువులో పడి అక్కాచెల్లెళ్లు అస్మిత(15), వైశాలి(13) వారి బంధువుల అమ్మాయి అంజలి(15) మృతిచెందారు. ముథోల్‌ సీఐ అజయ్‌ బాబు తెలిపిన వివరాల మేరకు.. ఈ ముగ్గురు బాలికలు ఆదివారం మధ్యాహ్నం చేనుకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైశాలి, అస్మిత వాళ్ల తల్లి మంగళబాయి ముగ్గురినీ ఇంటికి వెళ్లిపోవాలని చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Lottery: అబుదాబిలో కేరళ డ్రైవర్‌కు జాక్‌పాట్‌

8. కన్నీళ్లు పెట్టుకున్న చిరాగ్‌ పాసవాన్‌

దివంగత నేత, దళిత దిగ్గజం రాంవిలాస్‌ పాసవాన్‌ను గుర్తుచేసుకుని ఆయన కుమారుడు, ఎల్జేపీ యువ నేత చిరాగ్ పాసవాన్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం రాంవిలాస్‌ జయంతిని పురస్కరించుకుని కుటుంబసభ్యులు ఆయనపై పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరాగ్‌ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి సింహం లాంటి వ్యక్తి. ఆయన కొడుకుగా నేను ఎన్నడూ భయపడను. ఎంతమంది మమ్మల్ని కిందపడేయాలని చూసినా వెనకడుగు వేసేది లేదు. బిహార్‌ ప్రజలే నా బలం. నేను, నా తల్లి ఒంటరిగా నిలబడి వారికోసం పోరాటం చేస్తాం’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. IPL: 10 ఫ్రాంచైజీలు 90+ మ్యాచులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022 సీజన్‌కు బీసీసీఐ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్‌ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేయనుంది. డిసెంబర్లో భారీ వేలం నిర్వహించనుంది. 2022 జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు పిలవనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Cricket News: దాదా, గిల్‌ను శంకించడమే!

10. అక్కడ మాస్కులు ధరించడం ఇక ప్రజల ఇష్టం!

బ్రిటన్‌లో ఇక మాస్కు పెట్టుకోవడం ప్రజల ఇష్టానికే వదిలేసే రోజులు రానున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతున్న నేపథ్యంలో దేశంలో ఈనెల 19 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేసేందుకు ప్రధాని సిద్ధమవుతున్నట్లు బ్రిటన్‌ మీడియాలో వార్తలొచ్చాయి. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే ఆంక్షలను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మాస్కులు పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేయకుండా కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు బ్రిటన్‌ గృహనిర్మాణ శాఖ మంత్రి రాబర్ట్‌ జెన్‌రిక్‌ ఆదివారం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని