Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 21/08/2021 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Huzurabad by election: కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరంటే..?

హుజూరాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. బరిలో నిలిపేందుకు అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ కసరత్తు పూర్తి చేశారు. మూడు పేర్లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకుల పేర్లు ఈ నివేదికలో ఉన్నట్లు సమాచారం. నివేదికలో కొండా సురేఖ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికతో నేడు దిల్లీకి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ వెళ్లనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. In Pics: నేనూ అమ్మనే కదా..! అఫ్గాన్‌ పసికందులను లాలిస్తున్న విదేశీ సైనికులు

ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల చెర నుంచి తమ కంటిపాపలను కాపాడుకోవాలనే ఆరాటం.. వెరసి ఆ తల్లులు తమ గుండెను రాయి చేసుకున్నారు. మనసులో మెలిపెడుతున్న రంపపు కోతను పంటి బిగువున పట్టి కన్నబిడ్డలను పరాయి దేశానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ విదేశీ దళాలను వేడుకుంటున్నారు. ఆ తల్లుల వేదన భద్రతా దళాల మనసును కరిగించింది. అందుకే ఆ చిన్నారులను అక్కున చేర్చుకుని లాలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Afghanistan: మాట నిలబెట్టుకున్న అమెరికా సైన్యం

3. AP News: పూజలు చేస్తూ కొండపై నుంచి జారి పడి పూజారి మృతి

అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి పూజారి పాపయ్య 40 అడుగుల కిందకు జారిపడి మృతిచెందారు. స్వామివారికి పూజలు చేస్తుండగా ప్రమాదశాత్తు జారిపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎత్తైన కొండల మధ్య గంపమల్లయ్య స్వామి కొలువై ఉన్నారు. ఏటా శ్రావణమాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Muralitharan: వీరూ 2 గంటల్లో 150, రోజంతా 300 పరుగులైనా చేసేస్తాడు..

పరుగుల రారాజు సచిన్‌ తెందూల్కర్‌కు బంతులు వేసేందుకు భయపడేవాడిని కాదని శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. అతడు ఎక్కువగా ఇబ్బంది పెట్టడని పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, బ్రయన్‌ లారా అయితే బంతిని చితకబాదేవారని వెల్లడించాడు. వారికి బౌలింగ్‌ చేయడం ఎంతో కష్టంగా అనిపించేదని తెలిపాడు. ఈఎస్‌పీఎన్‌ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* PM Modi: నీరజ్‌ జావెలిన్‌, సింధు రాకెట్‌, లవ్లీనా గ్లోవ్స్‌.. వేలం వేయనున్న ప్రధాని మోదీ!

5. Viveka Murder Case: సమాచారం అందిస్తే రూ.5లక్షల రివార్డు: సీబీఐ 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక ప్రకటన చేసింది. కేసుకు సంబంధించి సమాచారం అందిస్తే రివార్డు ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. కచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఇస్తే రూ.5లక్షలు అందజేస్తామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ అధికారులు వెల్లడించారు. వారు ఫోన్‌ నంబర్ల ద్వారా కానీ, కార్యాలయంలో గానీ తమను సంప్రదించవచ్చని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. MAA Elections: త్వరలోనే ‘మా’ కల నెరవేరనుంది 

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ కల త్వరలో నెరవేరనుందని నటుడు మంచు విష్ణు అన్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఆయన తాజాగా ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ‘మా’కి శాశ్వత భవనం ఉండాలనేది అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరి కల అని.. అది త్వరలో నిజం కానుందని ఆయన అన్నారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించానని.. వాటిల్లో ఎక్కడ నిర్మించాలనే దానిపై త్వరలోనే అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* డికాప్రియోకు రూ.223 కోట్లు... జెన్నీఫర్‌కు రూ.186 కోట్లు

7. BheemlaNayak: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆన్‌ ఫైర్‌

వరుస సినిమాలతో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భీమ్లానాయక్‌’తో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రానా-పవన్‌కల్యాణ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్న విరామం దొరకడంతో పవన్‌ గన్‌ చేతపట్టారు. టార్గెట్‌ని ఎయిమ్‌ చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Afghanistan: తాలిబన్ల చెరలో భారతీయులు..?

అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. కాబుల్ విమానాశ్రయ సమీపం నుంచి 150 మంది పౌరులను తాలిబన్లు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. అఫ్గాన్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ వెంటనే అప్రమత్తమైంది. మరోపక్క ఈ వార్తలను తాలిబన్‌ ప్రతినిధి ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Afghan Crisis: అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తాం: బ్రిటన్‌ ప్రధాని

9. India Corona: 400 దిగువకు కరోనా మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది. ముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేసులు 5.7 శాతం మేర తగ్గగా.. మృతుల సంఖ్య 400 దిగువకు చేరిందని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 17,21,205 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 34,457 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో 375 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: అప్పుల్లేని రైతులను చూడాలనేది సర్కారు సంకల్పం: కేటీఆర్‌

రైతుల శ్రేయస్సు పట్ల తెరాస ప్రభుత్వం నిబద్ధతతో ఉందని మంత్రి కేటీ రామారావు అన్నారు. అప్పుల్లేని రైతులను చూడాలనేదే ప్రభుత్వ సంకల్పం అని స్పష్టం చేశారు. రూ.లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకు 35 లక్షల 19 వేల మంది రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి ట్వీట్‌ చేశారు. కరోనా సమయంలోనూ తెరాస ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకుందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS Politics: రెండేళ్లలో తెరాస ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు: కిషన్‌రెడ్డి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని