Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 27/08/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Kabul Airport Attack: కాబుల్‌ విమానాశ్రయంపై దాడి.. 103కు చేరిన మృతుల సంఖ్య..!

అఫ్గానిస్థాన్‌ భయానకంగా మారిపోయింది. ప్రాణభయంతో దేశం నుంచి పారిపోతున్న వారిని కూడా ఉగ్రవాదులు వదలడంలేదు. కాబుల్‌ విమానాశ్రయంపై జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 103కు పెరిగింది. ఈ దాడిలో 13మంది అమెరికా సైనికులు మరణించగా.. 90 మంది అఫ్గాన్‌ వాసులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. ఈ విషయాన్ని కాబుల్‌ అధికారులు వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Kabul Blasts: కాబుల్‌ పేలుళ్లలో తృటిలో తప్పించుకున్న సిక్కులు, హిందువులు!

2. Sonu Sood: కొత్త బాధ్యతల్లోకి ‘రియల్‌ హీరో’ సోనూసూద్

కొవిడ్ కల్లోలం వేళ.. ఆపన్న హస్తం అందించిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు సరికొత్త బాధ్యతలు స్వీకరించారు. దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. దానిలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్, సోనూసూద్ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Mohammed Shami: ఈ మాత్రం దానికే దిగులెందుకు? ఇంకా టైం ఉందని షమి భరోసా

మూడో టెస్టులో పేలవ ప్రదర్శన తమపై ఎలాంటి ప్రభావం చూపించలేదని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి అన్నాడు. కొన్నిసార్లు సుదీర్ఘ ఫార్మాట్లో చెడ్డ రోజులు ఎదురవుతాయని తెలిపాడు. ఐదు టెస్టుల సిరీసులో ఇంకా సమయం మిగిలే ఉంది.. ఆటగాళ్లు దిగులు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ‘లేదు, మిత్రమా! ప్రస్తుత ప్రదర్శన మాపై మానసికంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదు. మేం మూడు రోజుల్లో మ్యాచులు ముగించాం. కొన్ని సార్లైతే రెండు రోజుల్లోనే ముగించేశాం’ అని షమి అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

CPL 2021: ఈ బంతి చాలా స్మార్ట్‌ గురూ 

4. Sudheer Babu: నేను, ప్రభాస్‌ రాత్రంతా ట్యాంక్‌బండ్‌ వద్దే కూర్చున్నాం..!

ప్రభాస్‌ తనకి మంచి స్నేహితుడని నటుడు సుధీర్‌బాబు మరోసారి తెలిపారు. ప్రభాస్‌తో కలిసి ట్యాండ్‌బండ్‌ రోడ్లపై రాత్రంతా చక్కర్లు కొట్టేవాడినని గుర్తు చేసుకున్నారు. సుధీర్‌ హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Power Bill: సాధారణ కూలీకి కరెంటు బిల్లుతో గుండె గుబేల్‌!

వారిదో పేద కుటుంబం.. కూలికెళ్తేగానీ కడుపు నిండదు.. పింఛన్  వస్తే తప్ప సంసారం సాగదు. కాలక్షేపానికి ఇంట్లో ఓ చిన్న టీవీ.. ఉక్కపోస్తే ఒక ఫ్యాన్! చీకటి పడ్డాక వెలుగుల కోసం రెండు లైట్లు.. ఆ మాత్రానికే విద్యుత్‌ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. గుండె గుబేల్‌ మనేట్టుగా కరెంటు బిల్లు పంపారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప సాధారణ కూలి. ఆయన ఇంట్లో మూడు బల్బులు, టీవీ, ఫ్యాన్‌ ఉన్నాయి. ప్రతి నెలా కరెంట్‌ బిల్లు రూ.200- 300 మధ్య వచ్చేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Vehicle Insurance: 1 నుంచి ‘బంపర్‌ టు బంపర్‌’ బీమా తప్పనిసరి

6. Afghanistan Crisis: తాలిబన్ల అంతు చూస్తాం: పంజ్‌షేర్‌

దేశాన్ని ఆక్రమించి.. తమవైపు దూసుకొస్తున్న తాలిబన్లకు తలొగ్గేది లేదని పంజ్‌షేర్‌ సైనికులు తేల్చి చెప్పారు. తాలిబన్లతో రాజీపడే ఉద్దేశమే లేదని, వారి అంతు చూస్తామని ప్రకటించారు. తాలిబన్లపై పోరాడేందుకు ఉత్తర కూటమితో అఫ్గానిస్థాన్‌ ఆర్మీ మాజీ కమాండర్‌ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అలాగే.. అఫ్గాన్‌ ప్రజలు సైతం వారికి మద్దతుగా నిలుస్తున్నారు. పొరుగుదేశం తజకిస్థాన్‌ సైతం పంజ్‌షేర్‌ సైనికులకు మద్దతు పలికింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Maha Samudram: శర్వానంద్‌-సిద్ధార్థ్‌ల ‘మహా సముద్రం’ వచ్చేస్తోంది

శర్వానంద్‌-సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ విడుదల తేదీ ఖరారైంది. ఈ మేరకు చిత్రబృందం శుక్రవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 14న ‘మహాసముద్రం’ విడుదల కానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. అపురూప ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Crime News: ఆగంతకుల ఘాతుకం.. ఐదుగురి సజీవ దహనం

 అస్సాంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు సజీవ దహనమయ్యారు. దిమా అసవో జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఏడు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహనాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు మంటల్లో కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Crime News: వ్యక్తిని చంపి కారులో తీసుకెళ్లి తగులబెట్టేశారు

9. Dawid Malan: భారత బౌలర్లు శ్రమించారు.. కానీ!

మూడో టెస్టులో టీమ్‌ఇండియా బౌలర్లు అత్యంత క్రమశిక్షణతో బౌలింగ్‌ చేశారని ఇంగ్లాండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలన్‌ అన్నాడు. బంతులతో వారు తమకెన్నో ప్రశ్నలు సంధించారని పేర్కొన్నాడు. కానీ పిచ్‌ నుంచి వారికి సరైన సహకారం అందలేదని వెల్లడించాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ‘టీమ్‌ఇండియా బౌలర్లు పేలవంగా బౌలింగ్‌ చేశారని చెప్పలేను. ఎందుకంటే వారెంతో క్రమశిక్షణగా బంతులు విసిరారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మమ్మల్ని ప్రశ్నించారు’ అని మలన్‌ అన్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Corona Vaccine: కరోనా సోకినవారిలోనే రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువ!

కొన్ని కరోనా వ్యాక్సిన్ల వల్ల రక్తం గడ్డ కడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయా టీకాల వినియోగంపై కొన్ని దేశాల్లో పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే.. కరోనా సోకిన వారిలోనే రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువని తేల్చారు. ఈ మేరకు జరిపిన అధ్యయన ఫలితాల్ని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona: కొత్త కేసులు, మరణాలు కాస్త తగ్గాయి.. కానీ..


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని