Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 29/08/2021 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Joe Biden: ఒంటరి అయిన బైడెన్‌.. విమర్శల జడివానలో అమెరికా అధ్యక్షుడు

సంక్షోభంలోనే నాయకత్వ పటిమ బయటపడుతుంది.. ఈ లెక్కన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విఫలమై.. ఒంటరి అయ్యారన్న సూత్రీకరణలు తాజాగా వినవస్తున్నాయి. అఫ్గాన్‌ పరిణామాలతో పాటు వివిధ అంశాలపై ఆయన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి సుస్థిరతలను, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి 20ఏళ్ల పాటు సైనిక కార్యకలాపాలు నిర్వహించి, లక్ష కోట్ల డాలర్లు వెచ్చించినా.. చివరకు తాలిబన్లను అణచలేక అమెరికాయే అక్కడి నుంచి వైదొలగవలసి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Afghanistan Crisis: 24-36 గంటల్లో మరో ఉగ్రదాడి: బైడెన్‌

2. AP News: ఉక్కు ఉద్యమం@ 200 రోజులు.. కార్మికుల భారీ మానవహారం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200 రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు భారీ మానవహారాన్ని చేపట్టాయి. అగనంపూడి నుంచి అక్కిరెడ్డి పాలెం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో గాజువాక వద్ద తెదేపా మాజీ ఎమ్మెల్యే పళ్ల శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Jair Bolsonaro: మరణమో..గెలుపో..తన భవిష్యత్తుపై బోల్సోనారో!

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుకు సంబంధించి తనకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. జైలుకు వెళ్లడం, మరణించడం, 2022 అధ్యక్ష ఎన్నికలు గెలవడం.. ఇందులో ఏదో ఒకటి జరగొచ్చన్నారు. అయితే, తనని అరెస్టు చేయడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ భూమిపై తనని బెదిరించే వారే లేరన్నారు. పరోక్షంగా తానేమీ తప్పు చేయలేదంటూ తన నిర్ణయాల్ని, విధానాలను సమర్థించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏడాది గడిచినా వదలని కొవిడ్‌ వాసనలు.. ‘లాన్సెట్‌’ అధ్యయనంలో వెల్లడి

కొవిడ్‌-19తో ఆసుపత్రిపాలైన వారిని ఏడాది తర్వాత కూడా రుగ్మతలు వదలడంలేదు. 12 నెలలు గడిచినా.. ఇలాంటివారిలో దాదాపు సగం మందిని ఆ ఇన్‌ఫెక్షన్‌ మిగిల్చిన ఏదో ఒక సమస్య పీడిస్తోందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ వివరాలు వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. చైనాలోని వుహాన్‌లో 1,276 మందిపై పరిశోధన చేసి, ఈ మేరకు తేల్చారు. కొందరు రోగులు కోలుకోవడానికి ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతోందని వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona Update: స్వల్పంగా తగ్గిన రోజువారీ కేసులు!

5. CBN: గిడుగు రామ్మూర్తి ఆకాంక్షలు నీరు గారిపోతున్నాయి: చంద్రబాబు

తెలుగునాట వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామ్మూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న ప్రపంచంలోని తెలుగువారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం గిడుగు రామ్మూర్తేనని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. SI Suicide: విజయనగరంలో మహిళా ఎస్సై భవానీ ఆత్మహత్య

గరంలోని పోలీస్‌ శిక్షణ కళాశాల(పీటీసీ) క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మహిళా ఎస్సై కె.భవాని(25) ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఎస్సైగా పని చేస్తున్న భవాని.. క్రైమ్‌ శిక్షణ నిమిత్తం ఐదు రోజుల క్రితం విజయనగరం వచ్చారు. శనివారం మధ్యాహ్నానికి శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో భవాని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. HBD Nagarjuna: సాహసాల ‘మన్మథుడు’.. అభిమానుల ‘గ్రీకువీరుడు’

సైకిల్‌ చైన్‌ తెంచి టాలీవుడ్‌ హీరోయిజానికి కొత్త దారి వేసిన కథానాయకుడు నాగార్జున. ‘హలో గురు ప్రేమకోసమే’అని పాడుకుంటూ హీరోయిన్‌ వెంటపడితే ప్రేక్షకులూ గంతులేశారు.  మా..మా.. మాస్ అంటూ చొక్కా మడతేసి కొడితే థియేటర్లో అభిమానులు పూనకంతో ఊగిపోయారు.  క్యాన్సర్‌ బాధితుడిగా ‘గీతాంజలి’లో చూపించిన విషాదానికి సినిమా హాళ్లు కన్నీళ్లతో తడిశాయి. ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’ సినిమాలకి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది తెలుగు సినీ లోకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Kajal: అక్కినేని ఫ్యాన్స్‌కు కాజల్‌ సర్‌ప్రైజ్‌..!

8. Kidney Disease: మూత్రపిండాల వ్యాధికి ఆయుర్వేద విరుగుడు

పలు రకాల మూలికలతో కూడిన ఆయుర్వేద ఔషధం ‘నీరి-కేఎఫ్‌టీ’తో మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు ప్రయోజనం కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. ఇది దీర్ఘకాల కిడ్నీ రుగ్మత ఉద్ధృతిని నెమ్మదింపచేయడమే కాకుండా ఈ అవయవం మునుపటిలా ఆరోగ్యంగా పనిచేసేందుకూ వీలు కల్పిస్తుందని వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ‘సౌదీ జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌’లో ప్రచురితమయ్యాయి. భారత్‌కు చెందిన ఏఐఎంఐఎల్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ నీరి-కేఎఫ్‌టీని ఉత్పత్తి చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Cyber Insurance: సైబర్‌ బీమా ప్రాధాన్యం పెరిగింది

‘కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో కార్పొరేట్‌ బీమా రంగం కీలకంగా మారింది. ముఖ్యంగా సైబర్‌ సెక్యూరిటీ, బృంద ఆరోగ్య బీమా విభాగాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఇంటి నుంచి పని నుంచి ఆఫీసు నుంచి పనికి క్రమంగా మారుతున్న నేపథ్యంలో సంస్థలు అందుకు తగ్గట్టుగా సిద్ధం అవుతున్నాయి’ అని అంటున్నారు ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలోక్‌ అగర్వాల్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Bhavina Patel:లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా: భవీనా పటేల్

పారాలింపిక్స్‌లో భవీనా పటేల్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. టేబుల్ టెన్నిస్‌లో భవీనా.. రజత పతకం సాధించి చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్, చైనా క్రీడాకారిణి యింగ్ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. పతకం సాధించిన అనంతరం భవీనా పటేల్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని