Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 31/08/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Paralympics: భారత్‌కు మరో కాంస్యం

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో సింగ్‌రాజ్‌ అధానా క్యాంస పతకం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్‌ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IND vs ENG: కోహ్లీ ఆ దేశాల్లో ఇబ్బంది పడుతున్నాడు: అకిబ్ జావెద్‌

2. TS High Court: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Bengaluru Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డీంఎకే ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరమంగళ ప్రాంతంలో ఓ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు సహా ఏడుగురు మృతి చెందారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. తుదిశ్వాస విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది దుర్మరణం

4. TSRTC: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. కొట్టుకుపోయింది!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద వరదనీటిలో చిక్కుకున్న టీఎస్‌ ఆర్టీసీ బస్సు ఈరోజు కొట్టుకుపోయింది. నిన్న వరద ప్రవాహంతో గంభీరావుపేట శివారు మానేరు వాగు లోలెవల్‌ బ్రిడ్జి వద్ద బస్సు చిక్కుకుంది. బస్సులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు. అనంతరం బ్రిడ్జిపై చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో బయటకు తెచ్చేందుకు యత్నించినా సాధ్యపడలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Naga Shaurya: ఆ అందం.. పొగరు.. ఆర్డర్‌ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది!

నాగశౌర్య కథానాయకుడిగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఫ్యామిలీ, లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. రీతూ వర్మ కథానాయిక. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tollywood Folk Songs: జనం గుండెల్లోంచి టాలీవుడ్‌ తెర దాకా!

6. Supreme Court: కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. తొలిసారి ప్రత్యక్ష ప్రసారం

సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. న్యాయస్థానం చరిత్రలో తొలిసారి న్యాయమూర్తుల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం మాత్రమే ప్రత్యక్ష ప్రసారమయ్యేది. ఇప్పుడు తొలిసారిగా న్యాయమూర్తుల బాధ్యతల స్వీకారం కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Afghanistan: అల్విదా అఫ్గాన్‌.. కాబుల్‌ను వీడిన చిట్టచివరి అమెరికా సైనికుడితడే..

ఉగ్రవాదంపై పోరులో 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అఫ్గాన్‌ గడ్డ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగింది. సోమవారం అర్ధరాత్రికి ఒక నిమిషం ముందు కాబుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి యూఎస్‌ రక్షణ దళాలతో కూడిన చివరి విమానం బయల్దేరింది. అధ్యక్షుడు జో బైడెన్‌ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే అమెరికా దళాలు అఫ్గాన్‌ను వీడాయి. దీంతో రెండు దశాబ్దాల యుద్ధానికి సంపూర్ణ ముగింపు పలికినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Taliban: అధికారంలోకి వచ్చినా అజ్ఞాతమేనా?

8. Sovereign Gold Bonds: ఎస్‌బీఐ నుంచి సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను ఎలా కొనుగోలు చేయాలి?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) గాను 6వ విడత ప‌సిడి ఆగ‌ష్టు 30 నుంచి అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ బాండ్లు సెప్టెంబ‌రు 3వ‌ తేది వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. మ‌దుప‌రులు వారి డీ మ్యాట్ ఖాతాల ద్వారా గానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన ఇతర మార్గాల ద్వారా గానీ బాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Crime news: కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో మలుపు

కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్‌ పురలో వివాహితపై హత్యయత్నం ఘటన మలుపు తిరిగింది. తొలుత వివాహిత పని చేసుకుంటున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమె గొంతు కోశాడని ప్రచారం జరిగింది. అయితే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వివాహితపై దాడి జరగలేదని నిర్ధరించారు. తానే గొంతు కోసుకొని.. హత్యాయత్నం జరిగినట్లు నమ్మించిందని గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్‌

10. India Corona: దేశం మొత్తం 30 వేలు.. కేరళలోనే19 వేల కరోనా కేసులు!

గత కొంతకాలంగా కరోనా వ్యాప్తిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 30 నుంచి 40వేల చేరువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. ముందురోజుతో పోల్చితే 27.9 శాతం మేర క్షీణించాయి. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని