Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 03/09/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Panjshir: ‘తాలిబన్లు యుద్ధానికి వస్తే.. నేరుగా నరకానికే పంపుతాం’ 

అఫ్గానిస్థాన్లోని పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ఉత్తర కూటమి సేనలు ప్రకటించాయి. పంజ్‌షేర్‌లోని కొంత భూభాగాన్ని ఆక్రమించామంటూ తాలిబన్లు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశాయి. పంజ్‌షేర్‌లోకి ప్రవేశించేందుకు తాలిబన్లు పలుమార్లు యత్నించినా వారిని తిప్పికొట్టినట్లు ఉత్తర కూటమి సేనలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Avani Lekhara: 19 ఏళ్లకే దిగ్గజం.. అవని అద్భుతం.. ఒకే పారాలింపిక్స్‌లో 2 పతకాలు

పారా షూటర్‌ అవనీ లేఖరా.. అద్భుతం చేసింది. 19 ఏళ్లకే దిగ్గజంగా మారింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 పోటీల్లో ఆమె కాంస్య పతకం గెలిచింది. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ అర్హత పోటీల్లో అవని 1176 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఫైనల్లో ఆమె నువ్వా నేనా అన్నట్టు పోటీపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Paralympics: 18 ఏళ్లకే పతకం.. హైజంప్‌లో అదరగొట్టిన ప్రవీణ్‌

3. Rain Alert: రానున్న 3-4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

తెలంగాణలో రానున్న 3-4 రోజుల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. గురువారం రాత్రి హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Vijaysai Reddy: త్వరలోనే బయటకు ‘మాన్సాస్‌’ అవినీతి: విజయసాయిరెడ్డి

 మాన్సాస్‌ ట్రస్ట్‌లో చాలా అవినీతి జరిగిందని.. దీనిపై తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుతో చర్చకు సిద్ధమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. JioPhone Next: జియోఫోన్‌ నెక్ట్స్‌కి రూ.500 చెల్లిస్తే చాలట.. నిజమెంత?

జియో-గూగుల్‌ భాగస్వామ్యంలో రానున్న స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ నెక్ట్స్‌ను వినాయక చవితి పర్వదినమైన సెప్టెంబరు 10న విడుదల చేయనున్నారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇదే అని ప్రకటించడంతో.. దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్‌ ఫీచర్లు, ధరకు సంబంధించి నెట్‌లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Afghanistan: నాడు బైడెన్‌ను కాపాడి.. నేడు బిక్కుబిక్కుమంటూ!

అఫ్గానిస్థాన్‌లో తరలింపు చర్యలను అమెరికా బలగాలు హడావుడిగా ముగించిన తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. అఫ్గాన్‌లో ఏళ్ల పాటు తమకు సేవలందించిన పలువుర్ని అక్కడే వదిలేసి వెళ్లిన అగ్రరాజ్యం.. ప్రస్తుతం తమ దేశాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ను ఒకప్పుడు కాపాడిన స్థానికుడినీ శరణార్థిగా తీసుకెళ్లకపోవడం గమనార్హం. సెనేటర్‌గా ఉన్నప్పుడు 2008లో బైడెన్‌ అఫ్గాన్‌ పర్యటనకు వెళ్లారు. రెండు హెలికాప్టర్లలో ఆయన బృందం ప్రయాణిస్తుండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Afghanistan: టీవీల్లో ఆకట్టుకునే ఉపన్యాసాలు.. క్షేత్రస్థాయిలో హింస!

7. Dear Megha Review: రివ్యూ: డియర్‌ మేఘ

విడుద‌ల‌కు ముందే  పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన చిత్రం ‘డియ‌ర్ మేఘ‌’. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన ‘దియా’కు రీమేక్‌గా రూపొందింది. టైటిల్ పాత్ర‌ను మేఘా ఆకాష్ పోషించ‌గా.. అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు క‌థానాయ‌కులుగా న‌టించారు.  ఎ.సుశాంత్ రెడ్డి తెర‌కెక్కించారు. ‘‘మ‌న‌సుల్ని బ‌రువెక్కించే హృద్య‌మైన‌ ప్రేమ‌క‌థ’’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన ఈ చిత్రం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు.. కేరళలో 32వేల పైనే

 దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న రెండు నెలల గరిష్ఠానికి చేరిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 45,352 కేసులు బయటపడ్డాయి. అంతక్రితం రోజు(47,092)తో పోలిస్తే 3.6శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. అటు మరణాలు కూడా మళ్లీ 400 దిగువన ఉండటం ఊరటనిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Viral Video: నెల్లూరు జిల్లాలో వియ్యంకుల కొట్లాట.. వీడియో వైరల్‌

ఏడడుగులు.. మూడుముళ్లతో ముడిపడిన వివాహ బంధం ఆర్థిక గొడవలతో వివాదమైంది. భర్త ఇటీవల ఆత్మహత్య చేసుకోవటంతో భార్యకు కష్టాలు మొదలయ్యాయి. కళ్లెదుటే అత్తమామలు, తల్లిదండ్రులు రాళ్లతో దాడి చేసుకోవటంతో చంటిబిడ్డను ఒడిలో పట్టుకుని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం రకుల్‌ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

MAA Elections: ప్రముఖ హోటల్‌లో నరేశ్‌ పార్టీ.. వైరల్‌గా మారిన ఇన్విటేషన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని