Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 24/09/2021 22:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. IND vs ENG: ఐసీసీకి చేరిన ఐదో టెస్టు సమస్య.. సాయం చేయాలని కోరిన ఈసీబీ

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసీసీకి చేరింది. ఈ మ్యాచ్‌ భవితవ్యం సిరీస్‌ ఫలితంపై ఆధారపడటంతో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. ఈ విషయంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IND vs ENG: ఐదో టెస్టు నుంచి భారత్‌ తప్పుకోవడానికి అదే కారణం: నాసర్ హుస్సేన్‌

2. Covid Death Certificate: అలా అయితే.. అది కొవిడ్‌ మరణం కాదు!

కొవిడ్‌ సంబంధిత మరణాలకు ధ్రువపత్రాలు జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం ఓ అఫిడవిట్‌ దాఖలు చేస్తూ.. కొవిడ్‌ మృతుల బంధువులకు మరణానికి గల కారణాలతో వైద్య ధ్రువపత్రాలు జారీ చేయాలంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 3వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘బోగీ’భాగ్యం దూరమే!!

విశాఖ రైళ్లకు చెందిన అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ(లింక్‌ హాఫ్‌మన్‌ బుష్చ్‌) కోచ్‌ల్ని భువనేశ్వర్‌కు తరలించే ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందనే విమర్శలొస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో ఘటనా వెలుగులోకి వచ్చింది. విశాఖ-అమృత్‌సర్‌ మధ్య తిరిగే హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ నిమిత్తం వచ్చిన కోచ్‌ల్లో కొన్నింటిని భువనేశ్వర్‌-జగదల్‌పూర్‌ మధ్య తిరిగే హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌కు జతచేసి తిప్పుతున్నారు. అసలిది ఎలా జరిగిందనే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Attack with Drones: ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లతో దాడి!

పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లు ఇరాక్‌లోని ఇర్బిల్‌ అంతర్జాతీయ వినాశ్రయంపై దాడి చేశాయి. కనీసం రెండు డ్రోన్లు వచ్చినట్లు ఖుర్దిస్థాన్‌ కౌంటర్‌ టెర్రిజం సర్వీస్‌ వెల్లడించింది. దాడితో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఎయిర్‌పోర్టు వద్ద మూడు సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఓ డ్రోన్‌ పేలుడు తర్వాత ధ్వంసం కాగా.. మరొకదాన్ని భద్రతా బలగాలు కాల్చాయని స్థానిక మీడియా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Kozhikode airport crash: విమానాన్ని కాటేసిన ‘వైపర్‌’..!

5. AP News: గణేశ్‌ మండపం వద్ద డాన్స్‌ చేస్తూ యువకుడి ఆకస్మిక మృతి

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గౌతమిపురి కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపం వద్ద ఓ యువకుడు నృత్యం చేస్తూ ఉన్నట్టుండి కూప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. నృత్యం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే యువకుడు చనిపోయాడని వైద్యులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. AP Politics: విజయసాయిరెడ్డి సలహాతోనే మటన్‌ మార్టులా?: బుద్దా వెంకన్న

మాంసం, చేపలు, రొయ్యలు అమ్మే బడుగు, బలహీనవర్గాల పొట్ట కొట్టేందుకే మటన్‌ మార్టుల పేరిట సీఎం జగన్‌ కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. డిగ్రీ, పీజీలు చదివిన వారికి తగిన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం.. చివరికి వారికి మాంసం దుకాణాల్లో కొలువులివ్వడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. MAA Elections: చర్చించుకుందాం రండి..!: ప్రకాశ్‌రాజ్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రచారం తెలుగు సినీ పరిశ్రమలో ఊపందుకుంది. అధ్యక్ష పీఠం కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు విందు రాజకీయాలకు వీరు తెరతీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ సినీ కళాకారులను కలిసి.. సమస్యల గురించి వారితో చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా కళాకారులకు ఆదివారం నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో విందు ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

MAA Elections: కళాకారుల్ని ఒకచోటికి చేర్చి జీవితాలతో చెలగాటాలాడొద్దు

8. Gujarat: గుజరాత్‌ తదుపరి ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న ఉత్కంఠ!

గుజరాత్‌లో ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఇదే విషయంపై భాజపా అధిష్ఠానం తర్జనభర్జనలు పడుతోంది. ఈ మేరకు అంతర్గతంగా పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులతో నాయకులు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు గుజరాత్‌లో ఈరోజు భాజపా ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Prabhas: స్నేహితుడి విజయం.. సంతోషంలో ప్రభాస్‌

తన స్నేహితుడు గోపీచంద్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారని పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అన్నారు. గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన ‘సీటీమార్‌’ సినిమా విజయంపై ప్రభాస్‌ తాజాగా స్పందించారు. ‘‘సీటీమార్‌’తో నా స్నేహితుడు బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. నాకెంతో ఆనందంగా ఉంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఫలితం గురించి కంగారులేకుండా ఇలాంటి పెద్ద చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’ అని ప్రభాస్ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. India Corona: 30 వేల దిగువకు కొత్త కేసులు..

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 30 వేల దిగువకు కొత్త కేసులు చేరడం కాస్త ఊరటనిస్తోంది. ఇక మరణాలు మాత్రం 300కుపైనే నమోదయ్యాయి. మరోవైపు కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అధిక శాతం ఆ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో కొత్తగా 20,487 కేసులు నమోదు కాగా.. 181 మరణాలు చోటుచేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని