Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Published : 18/09/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Amarinder Singh: రాజీనామా యోచనలో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌?

పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదిరినట్లు సంకేతాలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో విసిగిపోయానని సీఎం అమరీందర్‌ సింగ్‌ అధిష్ఠానానికి తెలిపినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈరోజు సాయంత్రం పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశమై అమరీందర్‌ వారసుణ్ని ఎన్నుకోనున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. drone strike in Afghan: సారీ.. ఆరోజు మేం తప్పు చేశాం!

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో గత నెల 29న జరిపిన డ్రోన్‌ దాడికి సంబంధించి అమెరికా ఎట్టకేలకు తప్పు అంగీకరించింది. నాటి దాడిలో కేవలం సాధారణ ప్రజలే చనిపోయారని ఒప్పుకుంది. ఈ మేరకు తమ అంతర్గత సమీక్షలో నిజాలు వెల్లడయ్యాయని శుక్రవారం పేర్కొంది. కాబుల్‌ విమానాశ్రయం వైపు పేలుడు పదార్థాలతో దూసుకొస్తున్న వాహనంపై తాము డ్రోన్‌ దాడి చేశామని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

France: అమెరికా, ఆస్ట్రేలియాది వెన్నుపోటు.. ఫ్రాన్స్‌ ఆగ్రహం!

3. Anil Kumble as Head Coach: టీమ్‌ఇండియా కోచ్‌గా మళ్లీ అనిల్‌ కుంబ్లే?

ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్‌గా తప్పుకొంటున్నట్లు సారథి విరాట్‌ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ పొట్టి ప్రపంచకప్‌ తర్వాత హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి కాలపరిమితి కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఆ బాధ్యతల్లోకి మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లేను తీసుకువచ్చేలా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. India Corona: మళ్లీ పెరిగిన కేసులు.. ఆ రాష్ట్రానిదే మెజార్టీ వాటా

ఈ వారం మొదట్లో తగ్గినట్టే కనిపించిన కరోనా కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజాగా 3.6 శాతం మేర పెరిగి కేసులు 35 వేలకు చేరాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. సగానికిపైగా కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 23 వేలకుపైగా కేసులు వెలుగుచూడగా.. 131 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో 3,586 మంది వైరస్‌ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో 35,662 మందికి కరోనా సోకింది. 281 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. James Bond Movie: జేమ్స్‌ బాండ్ సినిమాలో నోకియా ఫోన్లు.. వివరాలివే!

యాక్షన్‌ చిత్రాల్లో జేమ్స్‌బాండ్ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పటి వరకూ జేమ్స్‌బాండ్ సిరిసీలో 24 చిత్రాలు వచ్చాయి. జేమ్స్‌బాండ్ 25వ చిత్రంగా డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్‌ టు డై’ రానుంది. భారత్‌లో సెప్టెంబరు 30న విడుదలవుతుండగా, అమెరికాలో అక్టోబరు 8న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నోకియా కంపెనీ తయారుచేసిన మూడు స్మార్ట్‌ఫోన్లు కనిపించనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

james bond: జేమ్స్‌ బాండ్‌ పాత్ర పుట్టిందిలా.. ఆయన అలా చేయకపోతే బాండ్‌ లేడు..

6. AP Politics: సినీ పెద్దల కోరిక మేరకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం: రోజా

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెదేపా నేత అయ్యన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆ వ్యాఖ్యలు చాలా బాధాకరమన్న రోజా.. అయ్యన్న మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. AP Politics: నిరసన తెలిపేందుకు వెళితే.. దండయాత్ర అంటున్నారు: జోగి రమేశ్‌

తెదేపా నేత అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై బాధ కలిగి నిరసన తెలిపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి వెళితే దండయాత్ర అంటున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ అన్నారు. చంద్రబాబును కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లానని ఆయన తెలిపారు. తన వెంట వైకాపా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: చంద్రబాబు ఇంటిపై దాడి ఘటన.. గవర్నర్‌ను కలవనున్న తెదేపా బృందం

8. KTR: గిఫ్ట్‌ ఏ స్మైల్‌తో దివ్యాంగులకు చేయూత: కేటీఆర్‌

నగరంలోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ట్రై మోటార్‌ వాహనాలను పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని 105 మంది దివ్యాంగులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘ఎంపీ రంజిత్‌రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద దివ్యాంగులకు చేయూతనిస్తున్నారు’’ అని కేటీఆర్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Viveka Murder Case: వివేకా హత్యకు వాడిన ఆయుధాలపై విచారణ!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 103వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు ఇవాళ కడప జమాలపల్లి వాసి విజయశంకర్‌రెడ్డి హాజరయ్యారు. ఇతను తొలిసారి సీబీఐ విచారణకు వచ్చాడు. ఇతడితో పాటు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Akhanda: ‘అఖండ’ మ్యూజిక్‌ జాతర షురూ..! ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది..!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘అఖండ’ మ్యూజిక్‌ జాతర షురూ అయ్యింది. అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ఫుల్‌ టైమ్‌ మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని మొదటిపాటను శనివారం చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆయన అడుగు.. రాసిన పుస్తకం ఒక శతాబ్దం మాట్లాడుకుంటూనే ఉంది: త్రివిక్రమ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని