Top Ten News @ 9 AM - top ten news at nine am
close
Updated : 08/06/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. Coronavirus: చర్మాన్నీ వదలని కరోనా

శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపుతున్న కొవిడ్‌-19 మహమ్మారి.. చర్మాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. ఈ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారికి హెర్పిస్‌ ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టడం నుంచి జుట్టు రాలిపోవడం, గోళ్ల సమస్యలు వరకూ.. అనేకరకాల చర్మ రుగ్మతలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. రోగ నిరోధక శక్తి తగ్గడమే ఇందుకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన కొవిడ్‌ బాధితులు, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నవారు చర్మ ఇన్‌ఫ్లమేషన్‌కు సంబంధించిన లక్షణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, అవి మరీ ఇబ్బంది పెడితే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Coronavirus: పేగులపైనా కరోనా ప్రభావం

2. నా సంబంధాలను పట్టించుకోకంటాడు!

నా భర్త తనతో పనిచేసే మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అడిగితే...అవన్నీ కామన్‌, నువ్వు పట్టించుకోకూడదంటాడు. ఈ విషయంలో మాకు చాలాసార్లే గొడవలయ్యాయి. పోట్లాడినప్పుడు తప్పయ్యింది అంటాడు. ఒక్కోసారి నాకే పాపం తెలీదంటాడు. ఇల్లు దాటితే మామూలే. చాలా విచిత్రంగా ఉంటుంది తన ప్రవర్తన. ఆయన్ని మార్చుకోవడం ఎలా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. UP: రూ.80 వేలకు కోడలిని అమ్మేసిన మామ!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్‌ గ్రామంలో శనివారం అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన కోడలిని కొందరు వ్యక్తులకు అమ్మేశాడు. ఇందుకోసం గుజరాత్‌కు చెందిన పలువురితో రూ.80వేలకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు బాధితురాలితో సహా రైల్వేస్టేషన్‌లో తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. వారి చెర నుంచి బాధితురాలిని విడిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: గంగానదిలో అస్తికలు కలిపేందుకు ‘స్పీడ్‌ పోస్ట్‌’!

4. Corona: ట్రంప్‌ డిమాండుకు చైనా తిరస్కరణ

కరోనా కారణంగా నష్టపోయిన అమెరికాతోపాటు ప్రపంచానికి 10 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.700 లక్షల కోట్లు) పరిహారంగా చెల్లించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన డిమాండును సోమవారం చైనా తిరస్కరించింది. శనివారం నార్త్‌ కరోలినాలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ కరోనాను చైనా వైరస్‌, వుహాన్‌ వైరస్‌ అని అభివర్ణించారు. ఇందుకు చైనాయే బాధ్యత తీసుకొని, భారీ పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Corona Strain: మూడో దశలో హైబ్రిడ్‌ వేరియంట్

కరోనా మూడో దశలో హైబ్రిడ్‌ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తమ అధ్యయనంలో వెల్లడైందని వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) బయోటెక్నాలజీ సహాయ ఆచార్యుడు పెరుగు శ్యాం వెల్లడించారు. కొవిడ్‌ వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్లే రకరకాల స్ట్రెయిన్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 కోట్ల నిధులతో నిట్లో ఏడాదిగా కొవిడ్‌ పరిణామ క్రమంపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఫంగస్‌ మరణాలెక్కువే!

6. Surabhi Drama: విషాద సురభి!

సురభి... అసాధారణ చరిత్ర ఉన్న నాటక సమాజం... కరోనా విజృంభణతో కకావికలమైపోతోంది. 136 ఏళ్ల తమ ప్రస్థానంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదంటూ సమాజంలో ఎవరిని కదిపినా కంటతడి పెడుతున్నారు. సురభి ఆధ్వర్యంలో తెలుగునేలపై ఒకప్పుడు యాభైకి పైగా విస్తరించిన నాటక సమూహాలు గత కొన్నేళ్లలో ఒకదాని తర్వాత ఒకటి మూతపడ్డాయి. మిగిలిన నాలుగైదూ కరోనా విజృంభణతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కళారాధనలోనే ఉన్న వేంకటేశ్వర నాట్యమండలి గతేడాది కొవిడ్‌ దెబ్బకు నిలిచిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Vaccine: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌.. రెండూ భేష్‌

కొవిడ్‌పై పోరులో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు రెండూ సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనమొకటి తేల్చింది. వైరస్‌కు వ్యతిరేకంగా మంచి రోగ నిరోధకతను అవి ఉత్పత్తి చేస్తున్నాయని నిర్ధారించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 22 నగరాల్లో 515 మంది ఆరోగ్యరంగ సిబ్బందిపై తాజా అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్నవారు 90 మంది. మిగిలిన 425 మంది- కొవిషీల్డ్‌ రెండు డోసులు వేసుకున్నవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: మూడేళ్ల తర్వాతే కుదుటపడేది!

8. IT Returns: మరింత సులభంగా ఐటీ రిటర్నులు

ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణలో చిక్కులు తొలగించి, పన్ను చెల్లింపుదారులు మరింత సులభంగా వీటిని దాఖలు చేసేందుకు వెబ్‌సైట్‌లో ఆదాయపు పన్ను విభాగం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులూ చేస్తూనే ఉంటుంది. ఈసారి ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌ 2.0 పోర్టల్‌ మరిన్ని కొత్త సదుపాయాలతో అందుబాటులోకి వచ్చింది.ఇప్పటివరకు ఇ-ఫైలింగ్‌ సేవలను అందించిన ‌www.incometaxindiaefiling.gov.in స్థానంలో ‌www.incometax.gov.in లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సమర్పించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మెదడులో కణితి కల్లోలం

అన్ని అవయవాల పనితీరును నియంత్రించేది, నిర్వర్తించేది మెదడే. ఇంతటి కీలకమైన మెదడులో కణితి (ట్యూమర్‌) ఏర్పడితే? ఎవరికైనా ఆందోళన సహజమే. నిజానికి మెదడు కణితులన్నీ క్యాన్సర్‌ కానవసరం లేదు. మామూలువీ కావొచ్చు. వీలైనంత త్వరగా గుర్తిస్తే కొన్ని కణితులను పూర్తిగా నయం చేయొచ్చు. కావాల్సింది అవగాహనే. వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యామర్‌ డే సందర్భంగా మెదడు కణితులపై సమగ్ర కథనం ఈవారం మీకోసం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Semaglutide Injection: బరువుకో ఇంజెక్షన్‌!

10. జోకర్‌.. పడి లేచాడు

ప్రపంచ నం.1 జకోవిచ్‌కు చెమటలు పట్టాయ్‌! కళ్లుచెదిరే ఆటతో 19 ఏళ్ల లొరెంజో ముసెటి (ఇటలీ) సంచలనం సృష్టించేలా కనిపించినా అసాధారణంగా పుంజుకున్న నొవాక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. నాదల్‌ కూడా ముందంజ వేయగా, మహిళల సింగిల్స్‌లో కొకోగాఫ్‌, సకారి కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని