Top Ten News @ 9 AM - top ten news at nine am
close
Published : 15/06/2021 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. Corona: కరోనాలో కొత్త వేరియంట్‌.. డెల్టా ప్లస్‌

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు సంబంధించిన డెల్టా వేరియంట్‌ కొత్త అవతారమెత్తింది. ఇది మరోసారి ఉత్పరివర్తన చెంది, ‘డెల్టా ప్లస్‌’ లేదా ఏవై.1 పేరుతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. దీనిపై ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. భారత్‌లో దీని ఉనికి చాలా తక్కువగానే ఉందని తెలిపారు. అయితే దేశంలో ఇటీవలే ఆమోదం పొందిన మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్స.. ఈ వైరస్‌పై పనిచేయడంలేదని వెల్లడైంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Coronavirus: కొవిడ్‌ ప్లస్‌

2. AP News: డిగ్రీలో తెలుగుమాధ్యమం ఉండదు

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం మూతపడనుంది. ఇక నుంచి విద్యార్థులు తెలుగులో చదివే అవకాశం కోల్పోనున్నారు. కళాశాలలన్నీ పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోనున్నాయి. ఉన్నత విద్యపై ఫిబ్రవరి 2న సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. CoronaVaccine: టీకా వ్యవధి తగ్గించాలి

డెల్టా రకం వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్‌ రెండో డోసు టీకా కాల పరిమితిని 12-16 వారాల నుంచి 8 వారాలకు తగ్గించడం మేలని ప్రముఖ వైద్యులు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. బ్రిటన్‌లో గత డిసెంబరులో అప్పటి ఒరిజినల్‌ రకం వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని కాల వ్యవధిని పెంచారని, ఆ తర్వాత డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం పెరగడంతో టీకా వ్యవధిని తగ్గించారని గుర్తు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రోజుకు 749 మంది మృతి

4. PM Modi: పనిమంతులకు పదవులు

కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టి ఊపిరితీసుకునే సమయం చిక్కడంతో ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే మంత్రివర్గంలో మార్పులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. బాగా పనిచేస్తున్న వారికి ప్రోత్సాహం ఇవ్వడం, ఖాళీలను భర్తీ చేయడం, మిత్రపక్షాల ఆకాంక్షలను నెరవేర్చడం, ప్రాంతాల వారీగా సమతౌల్యాన్ని పాటించడం, రాజకీయ ప్రయోజనాలను కాపాడడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. AP News: క‌డ‌ప జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం

క‌డప జిల్లా పులివెందుల మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ప్ర‌సాద్‌రెడ్డి అనే వ్య‌క్తి పార్థ‌సార‌థి రెడ్డిని తుపాకీలో కాల్చి చంపారు. అనంత‌రం ప్ర‌సాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆస్తి విష‌యంలో వివాదాలే కాల్పుల‌కు కార‌ణమ‌ని పోలీసులు చెబుతున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* TS News: ‘వేలంలో కొన్నాం.. సగం ధరకే ఇస్తున్నాం’

6. కుప్పకూలిన అదానీ షేర్లు

ఆసియా కుబేరుల్లోనే రెండో స్థానానికి చేరిన గౌతమ్‌ అదానీ గ్రూప్‌నకు సోమవారం భారీ షాక్‌ ఎదురైంది. ఈ గ్రూప్‌ షేర్లలో రూ.43,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు)- అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాసిటరీ లిమిటెడ్‌) మే 31 నుంచి స్తంభింపజేసినట్లు వార్తలు రావడంతో, అదానీ గ్రూప్‌ షేర్ల విలువలు 5-25 శాతం వరకు పతనమయ్యాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పదండి పోదాం ఫైనల్‌కు

1971లో పుట్టిన వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు 12 ప్రపంచకప్‌లు జరిగాయి!2005లో మొదలైన ట్వంటీ20 క్రికెట్లో 6 వరల్డ్‌కప్‌లు ముగిశాయి! కానీ క్రికెట్‌కు అసలైన నిర్వచనం అయిన టెస్టుల్లో మాత్రం ప్రపంచకప్‌ లేదిన్నాళ్లూ! ఎట్టకేలకు ఇప్పుడు ఈ ఫార్మాట్లోనూ ప్రపంచ సమరం చూస్తున్నాం. త్వరలోనే టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్‌ను చూడబోతున్నాం. టెస్టుల్లో ప్రపంచ టైటిల్‌ కోసం న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోబోతోంది భారత క్రికెట్‌ జట్టు. టెస్టు క్రికెట్‌ను ఎంతో ఇష్టపడే అభిమానులకు ఈ సమరం ఒక ఉద్వేగభరిత సందర్భమే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తుది నిర్ణయం బీసీసీఐదే

8. రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. తల్లి, కుమారుడు, కుమార్తె మృతి

కరోనా కాటుకు నెల వ్యవధిలో తల్లి, కుమారుడు, కుమార్తె బలైన సంఘటన శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో చోటు చేసుకుంది. తొండుపల్లికి చెందిన పెదిరిపాటి విఠలయ్య-సులోచన దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. ఏప్రిల్‌ 28న చిన్న కుమారుడు సుభాష్‌ తన 25వ వివాహ వార్షికోత్సవ వేడుకులను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆ కటుంబ సభ్యుల్లో ఐదుగురు కరోనా బారిన పడ్డారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలీసు కొలువుల భర్తీకి కసరత్తు

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. సాంకేతిక అడ్డంకులు కూడా తొలగిపోవడంతో వీలైనంత త్వరలోనే ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ప్రయత్నిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ప్రకటన జారీఅయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరోవారంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. తెలంగాణ ఏర్పడ్డాక 2014, 2018 సంవత్సరాల్లో పోలీసుశాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు జరిగాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సరిహద్దులు సుభద్రమేనా?

10. పదునైన మెదడు కోసం..

మేధాశక్తిని పెంచుకోవాలని ఎవరికి ఉండదు? అదృష్టం కొద్దీ విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి తేలికైన, చవకైన మార్గాలెన్నో ఉన్నాయి.  మెదడుకు పనిపెట్టే ఇవి మెదడు కణాల మధ్య కొత్త సంబంధాలు పుట్టుకు రావటానికి తోడ్పడతాయి. ఈ సంబంధాలు పెరిగినకొద్దీ మెదడులో సమాచారాన్ని చేరవేసే మార్గాలూ ఎక్కువవుతాయి. ఇవన్నీ అవసరమైనప్పుడు, అవసరమైన సమాచారాన్ని తేలికగా అందిస్తాయి. మెదడును సవాల్‌ చేసే పనులను బట్టి ఆయా భాగాలు గానీ మొత్తంగా గానీ మెదడు పుంజుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని