Top Ten News @ 9 AM - top ten news at nine am
close
Updated : 07/07/2021 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. Dileep Kumar: దిలీప్‌కుమార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌(98) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. దిలీప్‌కుమార్‌ మరణ వార్తతో బీటౌన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Vaccine: కొత్త వేరియంట్లనూ ఢీకొనే టీకాలు

కొవిడ్‌-19కు మరింత సమర్థమైన టీకాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఫార్ములాను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కరోనాలో వేగంగా పుట్టుకొస్తున్న వేరియంట్లనూ ఎదుర్కోగలదని పేర్కొన్నారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు స్పందనగా రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమయ్యే తీరు ఆధారంగా బోస్టన్‌ విశ్వవిద్యాలయం, హార్వర్డ్‌ వర్సిటీలోని బ్రాడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు. ప్రస్తుత కొవిడ్‌ టీకాలు రోగ నిరోధక వ్యవస్థలోని ‘బి’ కణాలను క్రియాశీలం చేయడంపై ప్రధానంగా దృష్టిపెడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: కణ ‘శక్తి’పై కరోనా దెబ్బ

3. మొండి బాకీల్లో వసూలయ్యేది ఎంత?

దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ- ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌)ని అయిదేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అప్పులు తీసుకుని, తిరిగి చెల్లించని వ్యాపార సంస్థల నుంచి ఎంతో కొంత మొత్తాన్ని వసూలు చేయడం, రుణాలు ఎగవేసిన సంస్థలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నవారికి అప్పగించడం, తద్వారా బ్యాంకులకు మొండి బాకీల భారాన్ని తగ్గించడం.. ఈ స్మృతి ప్రధానోద్దేశం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆమె పాటకు 105 కోట్ల వ్యూస్‌!

ఈ పాట ఏ పెద్ద హీరోనో, పాప్‌ స్టారో, పెద్ద సింగర్‌దో అయ్యుంటుంది అనుకుంటున్నారా! ఓ ప్రైవేటు ఆల్బమ్‌దే కానీ.. పాడింది మాత్రం ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి. పేరు.. రేణుక పన్వర్‌. మన అమ్మాయే. సోషల్‌ మీడియా మొత్తం ఇప్పుడు ఈమె గురించే! రేణుకకి చిన్నప్పటి నుంచి పాటలన్నా, డ్యాన్స్‌ అన్నా చాలా ఇష్టం. అమ్మానాన్నలూ బాగా  ప్రోత్సహించారు. వాళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖేక్‌డా. మధ్య తరగతి కుటుంబం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎట్లున్నవ్‌ కొడుకా.. ఎక్కడున్నవ్‌ నాన్నా..

నాడు ఏ ఎన్‌కౌంటర్‌ జరిగినా తమ వాళ్లు సురక్షితంగానే ఉన్నారా అని ఆరా తీస్తూ ఆందోళన చెందేవారు. నేడు ఒక్కొక్కరినీ కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంటుండడంతో అడవిలో అయినవాళ్ల ఆరోగ్యం ఎలా ఉందోనని ఆవేదనలో ఉన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తల్లిదండ్రులను, కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యలను వదిలి ఎంతో మంది అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌లో చేరి ఉద్యమ పంథాలో కొనసాగుతూ జన జీవన స్రవంతికి దూరంగా జీవిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రాణం పోతున్నా.. బాధ్యత మరవలేదు

6. సహజసిద్ధంగానే కరోనా ఆవిర్భావం!

చైనాలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలను నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలేవీ లేవని అంతర్జాతీయ నిపుణుల బృందమొకటి పేర్కొంది. ఈ వైరస్‌ ప్రకృతిసిద్ధంగానే ఆవిర్భవించిందని అనేక అధ్యయనాలు గట్టిగా సూచిస్తున్నాయని తెలిపింది. ఈ మేరకు వారు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ఒక కథనం రాశారు. ఈ బృందంలో దాదాపు పాతిక మంది జీవశాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, అంటువ్యాధుల నిపుణులు, వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు, జంతువైద్య పరిశోధకులు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పరిణామం అనంతం

ఇటీవల మానవజాతికో కొత్త బంధువు దొరికాడు. ఇప్పటివరకూ నియాండర్తాల్స్‌నే మన సమీప మానవులని భావిస్తున్న మనకు చైనాలో మరో ఆదిమ మానవుడి ఆచూకీ లభించటం పరిణామ చరిత్రను తిరగరాసేలా చేస్తోంది. మానవ పరిణామ ప్రక్రియపై మనకున్న అవగాహనను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. అనాదియైన, అనంతమైన మానవ పరిణామ క్రమం దిశగా మరోసారి దృష్టి సారించేలా చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కలప బ్యాటరీ

8. Universe: విశ్వంలో రాకాసి సునామీలు

 సముద్రాల్లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు చెలరేగినప్పుడు సునామీ రూపంలో భారీ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తుతుంటాయి. విశ్వంలోనూ ఇలాంటి రాకాసి అలలు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. వాయువులు, రేడియోధార్మికతతో కూడిన ఈ తరంగాలు కృష్ణబిలాల నుంచి వెలువడతాయని పేర్కొన్నారు. విశ్వంలోని నిగూఢ ఆకృతుల్లో ఒకటైన కృష్ణబిలాలు ఎప్పుడూ శాస్త్రవేత్తలకు సవాళ్లు రువ్వుతూనే ఉన్నాయి. వాటికి బలమైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శృంగార వల.. చిక్కితే విలవిల

 అవధుల్లేని ఆనందాన్ని ఆస్వాదిద్దాం... పరిమితుల్లేని శృంగారం మీ సొంతం అంటూ వాట్సప్‌ కాల్స్‌ ద్వారా నగ్నంగా మాట్లాడుతూ ఆపై వీడియోలు తీసి బెదిరిస్తున్న ఘరానా నేరస్థుల గుట్టురట్టయ్యింది. అంతర్జాలంలోని అశ్లీల వీడియోలను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని.. వాటికి వాయిస్‌ఛేంజ్‌ యాప్‌ను జోడించి... మాట్లాడుతున్న నేరస్థుల వివరాలు, సాక్ష్యాధారాలను హైదరాబాద్‌ పోలీసులు సేకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మీ కోసమే.. ఈ జరిమానాలు!

10. ఎక్కేయ్‌.. పతకాన్ని పట్టేయ్‌

క్లైంబింగ్‌ అంటే.. సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లి కొండలు, గుట్టల్లాంటివి ఎక్కడం. సెలవుల్లో లేదా వారాంతాల్లో కాలక్షేపం కోసం ఇలా చేస్తుంటారు. కానీ టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత క్లైంబింగ్‌ కథ మారిపోవడం ఖాయం. సరదా పక్కనపెట్టి దీన్ని కెరీర్‌గా మార్చుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించొచ్చు. ఎందుకంటే క్లైంబింగ్‌ ఇప్పుడు ఒలింపిక్‌ క్రీడ. టోక్యోలోనే అరంగేట్రం చేయబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని