Top Ten News @ 9 AM - top ten news at nine am
close
Updated : 11/07/2021 09:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM

1. కోపా అమెరికా టోర్నీ విజేతగా అర్జెంటీనా

కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకుంది. టోర్నీ ఫైనల్‌లో బ్రెజిల్‌పై విజయం సాధించింది. బ్రెజిల్‌పై 1-0 తేడాతో అర్జెంటీనా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో 15వ సారి ఈ టోర్నీని నెగ్గినట్లు అయింది. ఈ విజయంతో అర్జెంటీనా.. అత్యధిక టైటిళ్లు సాధించిన ఉరుగ్వే సరసన నిలిచింది. మెస్సీ సారథ్యంలో తొలిసారి అర్జెంటీనా అతిపెద్ద టోర్నీ గెలిచింది. 1993 తర్వాత ఈ జట్టు కోపా అమెరికా టోర్నీని ఇదే గెలవడం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నడి వయసులో.. మరో జోడి!!

45 ఏళ్ల వయసులో భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లితో మరో ప్రయాణానికి సిద్ధమైన సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని అంతరంగం. 15 ఏళ్లకే పెళ్లయింది.. ఆ తరువాత చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా.. అయినా రోజూ వేధింపులు. నా తలరాత ఇంతే అనుకున్నా. సమాజంలో వస్తోన్న మార్పుతో నాలోనూ ధైర్యం పెరిగింది. పదేళ్లుగా తెలిసిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు కారణమైందంటూ ఆమె వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఒంటరితనానికి విడాకులు!

3. బండమొహం, వీడు హీరో ఏంటి... అన్నారు!

దక్షిణాదిలోని మిగతా సినిమా పరిశ్రమల్ల్లా తమిళ సీమకి నిన్నామొన్నటిదాకా ‘మెగాస్టార్‌’లు ఎవరూ లేరు. ఇప్పుడా టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు విజయ్‌! సినిమా కలెక్షన్స్‌లోనే కాదు... పారితోషికంలోనూ అక్కడి సూపర్‌స్టార్‌ని మించిపోతున్నాడు! తెలుగు-తమిళ భాషల్లో రాబోతున్న ఆయన తర్వాతి చిత్రం ‘బీస్ట్‌’కి వందకోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడని భోగట్టా. ఈ విజయ్‌ ఒకప్పుడు నష్టజాతకుడిగా ముద్రపడ్డవాడు... నటించడానికే అర్హుడుకాడంటూ అవమానాలు ఎదుర్కొన్నవాడు. అలాంటివాడు మెగాస్టార్‌ ఎలా అయ్యాడో చూద్దామా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Covid: స్త్రీ, పురుషుల్లో భిన్నంగా కొవిడ్‌ స్పందన

కొవిడ్‌-19 కారక కరోనా వైరస్‌కు రోగనిరోధక వ్యవస్థలు స్పందిస్తున్న తీరులో స్త్రీ, పురుషుల మధ్య వైరుధ్యాలు ఉంటున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అంశం ఆధారంగా కొత్త ఔషధాలకు లక్ష్యాలను కనుగొనవచ్చని వారు పేర్కొన్నారు. యేల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. తీవ్రస్థాయి కొవిడ్‌, మరణం ముప్పు ఎక్కువగా ఉండే పురుష రోగుల్లో జీవక్రియకు సంబంధించిన ఒక చర్యాక్రమం.. రోగనిరోధక ప్రతిస్పందనకు అనుగుణంగా ఉంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనాను వేగంగా పసిగట్టే సాంకేతికత

5. కొండా కోనా... చూసొద్దామా..!

అలరించే జలపాతాలూ... ఆసక్తిని రేకెత్తించే కోటలూ... ఆహ్లాదాన్నిచ్చే సాగరతీరం... ఆకట్టుకునే అభయారణ్యాలు... ఎక్కగలవా అంటూ సవాలు చేసే కొండలు... ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కరోనా ధాటికి విహారయాత్రలకు మొహం వాచిపోయినవారికి - ఆ లోటు తీరుస్తాం రారమ్మని పిలుస్తున్నాయి..! అప్పుడప్పుడు నాలుగు రోజులు ఎటైనా వెళ్లిరావడం అనేది- అలసిన మనసుకి అవసరమైన సాంత్వన. గత ఏడాదిన్నరగా పరిస్థితులు ఆ అవసరానికి కళ్లెం వేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉప్పెనలా సైబర్‌ దాడి

 సైబర్‌ నేరాలు సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. కంప్యూటర్‌ వ్యవస్థను అతలాకుతలం చేసే రాన్సమ్‌వేర్‌కు కొనసాగింపుగా సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త ప్రక్రియకు తెరలేపారు. ‘సప్లై చైన్‌ ఎటాక్‌’ పేరుతో మొదలైన ఈ కొత్త దందా ఇప్పుడు ప్రపంచ వ్యాపార సంస్థలను వణికిస్తోంది. ఇది ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికాలోని అనేక రాష్ట్రాలకు చమురు సరఫరా చేస్తున్న ‘కలోనియల్‌ పైప్‌లైన్‌’ సంస్థపై దాడి చేయడంతో ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెల్లారేసరికి తాళం!

7. కామాంధుడు వీడు.. కనిపిస్తే కాటేస్తాడు

చిన్నారి బాలికలే లక్ష్యంగా లైంగిక దాడులకు పాల్పడుతున్న కామాంధుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసై చిన్నారుల పట్ల వికృతంగా ప్రవర్తించే ఈ 40 ఏళ్ల మృగాడి అరెస్టు వివరాలను శనివారం పోలీసులు వెల్లడించారు.ఒడిశాకు చెందిన అభిరామ్‌దాస్‌ అలియాస్‌ అభి 12ఏళ్ల క్రితం భార్యతో కలిసి నగరానికి వలసొచ్చాడు. ఎనిమిదేళ్ల క్రితం భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తెలంగాణ వాటాపైనా ఏపీ అప్పు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో... ఆంధ్రప్రదేశ్‌ తన లెక్కల్లో తెలంగాణ వాటానూ కలిపి చూపించి అధిక రుణం తీసుకుందని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిలో కోత పెడుతున్నామని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. 2021-22లో ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌కి ఇటీవల రాసిన లేఖలో స్పష్టం చేసిన కేంద్ర ఆర్థికశాఖ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించలేదా?

9. బ్యాంకులో అప్పు పుట్టదాయె.. బయట తెస్తే మిత్తీ భారమాయె

పంట రుణాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. దుక్కులు మొదలయ్యే మే నెల నుంచే పంట రుణాలను రైతులకు ఇస్తే వారికి పెట్టుబడుల కోసం వెదుక్కునే బాధలుండవు. కానీ వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ ప్రారంభమై నెల దాటినా ఇంతవరకూ నిర్ణీత పంట రుణాల లక్ష్యంలో 30 శాతం కూడా బ్యాంకులు ఇవ్వలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లోని ఒక బ్యాంకు శాఖలో 1,942 మంది రైతులకు ఖాతాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. శిరీష అంతరిక్ష యాత్ర నేడే

వినువీధిలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించబోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించనున్నారు. కల్పనాచావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత రోదసియానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ను వీఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘సూపర్బ్‌ స్వాతి’... డాక్టర్‌ కూడా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని