Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at nine am
close
Updated : 17/08/2021 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. అమెరికా వ్యయం బూడిదలో పోసిన పన్నీరే!

అఫ్గానిస్థాన్‌ అభివృద్ధి కోసం గత 20 ఏళ్ళ నుంచి అమెరికా వేల కోట్ల డాలర్లు ధారపోసింది. తాలిబన్లను ఎదుర్కోవడానికని అఫ్గాన్‌ సేనలకు ఆధునిక ఆయుధాలు, కొత్త సాంకేతికతలు సమకూర్చి, వాటి వాడకంలో శిక్షణనిచ్చింది. రోడ్లు, స్కూళ్లు, ఇతర మౌలిక వసతులు నిర్మించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించి, స్త్రీలకు స్వేచ్ఛనిచ్చింది. మానవ హక్కులకు రక్షణ కల్పించింది. ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Afghanistan Crisis: అధునాతన ఆయుధాలు.. తాలిబన్‌ పాలు

2. చడీచప్పుడూ లేకుండా..

ఒకవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరిన దాదాపు లక్ష మంది విద్యార్థులు టీవీ పాఠాలు ఎప్పుడు మొదలవుతాయా అని చూస్తున్నారు. ప్రవేశాలు ఇంకా జరుగుతున్నందున అవి పూర్తయిన తర్వాత మొదలవుతాయని అధ్యాపకులూ భావిస్తూ వచ్చారు. మరో వైపు ఇంటర్‌ విద్యాశాఖ మాత్రం చడీచప్పుడు లేకుండా సోమవారం మధ్యాహ్నం నుంచి దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠాలను ప్రసారం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. శామ్‌సంగ్‌ గెలాక్సీ మడతపెట్టే స్మార్ట్‌ ఫోన్లు

టెక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ తమ అల్ట్రా ప్రీమియం, మడతపెట్టేందుకు వీలైన గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌3 5జీ, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌3 5జీ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబరు 10 నుంచి భారత్‌లో అందుబాటులో ఉంచనుంది. వీటి ప్రారంభ ధర రూ.84,999. ‘శామ్‌సంగ్‌.కామ్‌ వెబ్‌సైట్‌ సహా ప్రముఖ రిటైల్‌ విక్రయశాలల్లో వీటి కోసం ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. వచ్చే నెల 10 నుంచి విక్రయాలు మొదలవుతాయ’ని శామ్‌సంగ్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రిలయన్స్‌లో అరామ్‌కోకు 20 % వాటా!

4. పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలను తగ్గించం: నిర్మలా సీతారామన్‌

ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, సుంకాలను తగ్గించడం ద్వారా పెట్రోల్‌, డీజిల్‌లపై ధరల్ని అదుపులోకి తీసుకొస్తారన్న సామాన్యుల ఆశలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నీళ్లు చల్లారు. సుంకాలను తగ్గించే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు. ‘యూపీఏ ప్రభుత్వ హయాంలో రాయితీపై ఇంధనం సరఫరా చేయడానికి ప్రభుత్వ రంగ రిటైలర్లకు రూ.1.34 లక్షల కోట్ల చమురు బాండ్లను జారీ చేశారు. దీనిపై గత ఏడేళ్లుగా మా ప్రభుత్వం రూ.70,196 కోట్ల వడ్డీ చెల్లించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ నలుగురూ..

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు పంతం నెగ్గించుకున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ క్రమంలో... అనూహ్య వేగంతో ప్రభుత్వాన్ని కూలదోసి, మళ్లీ తమ పాలన ఆరంభించారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించినవారే పాలనలోనూ కీలకంగా వ్యవహరించనున్నారు. అయితే చక్రం తిప్పేది మాత్రం నలుగురు నేతలే! వారు ఎవరంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Biden: అఫ్గానిస్థాన్‌ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రకటన 

6. TS News: గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం

రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్‌, అతడి స్నేహితులు గదిలో నిర్బంధించి, మత్తుమందిచ్చి వారంరోజులు సామూహిక అత్యాచారం చేశారు. తన తల్లి, పిన్ని కనిపించడం లేదంటూ బాధితురాలి కుమారుడు ఓ రేడియోగ్రాఫర్‌ను నిలదీయగా.. ఎక్కడున్నారో చూద్దామంటూ ఆదివారం సాయంత్రం ఆసుపత్రి అంతా కలియతిప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నోట్లో లాలాజలం తగ్గిపోతోంది

కరోనా నుంచి రక్షణకు గంటల తరబడి మాస్కు వాడుతున్నారా... ఇలా చేయడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోయి పళ్లు, చిగుళ్ల వంటి వాటిపై సూక్ష్మక్రిములు ప్రభావం చూపుతున్నట్టు వైద్యుల పరిశీలనలో తేలింది. ఇటీవల ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పటికే దంత వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే పరిస్థితి తీవ్రమవుతోందని వైద్యుల పరిశీలనలో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చురుకైన వీర్యకణాల కోసం

8. లార్డ్స్‌లో ఓ అద్భుతం

ఆఖరి రోజు అదరగొట్టిన టీమ్‌ ఇండియా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డ్రానే లక్ష్యంగా, ప్రతికూల పరిస్థితుల్లో సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 181/6తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌..  ఎవరూ ఊహించని స్కోరు సాధించి, ఆతిథ్య జట్టు పోరాడాల్సిన పరిస్థితిని కల్పించింది. బ్యాట్‌తో షమి (56 నాటౌట్‌; 70 బంతుల్లో 6×4, 1×6), బుమ్రా (34 నాటౌట్‌; 64 బంతుల్లో 3×4) అసాధారణ పోరాటంతో భారత్‌.. 298/8 వద్ద డిక్లేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాజల్‌ ఫిట్‌నెస్‌ రహస్యమిదే...

రోజూ చేసే సూర్య నమస్కారాలే తన ఫిట్‌నెస్‌ రహస్యమని చెబుతోంది అందాల నటి కాజల్‌ అగర్వాల్‌. వారంలో మూడు రోజులు యోగా చేసే అలవాటు తనను ఒత్తిడి నుంచి దూరం చేస్తోందంటోంది. ‘‘రోజూ చేసే అరగంట వ్యాయామం వల్ల కండరాలన్నీ పనిచేసి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీన్ని ప్రతి  ఒక్కరూ పాటించొచ్చు. శరీరంలోని అవయవాలన్నింటి కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఎంపిక చేసి వర్కవుట్స్‌ చేస్తే నిండైన ఆరోగ్యం సొంతమవుతుంది. నేనూ ఇవే పాటిస్తా’’ పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆరుణ్య మార్ట్‌..! గ్రామీణ ప్రత్యేకం

10. సబితపై కీలక ఆధారాలున్నాయి

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజు కేటాయింపుల్లో మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ సోమవారం సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేసింది. తాండూరుకు చెందిన గనుల లీజు పునరుద్ధరణ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంది. అభియోగాల నమోదు దశలో నిందితులను డిశ్ఛార్జి చేయరాదని తెలిపింది. పెన్నా కేసులో పెన్నా గ్రూపు అధినేత పెన్నా ప్రతాప్‌రెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌పై సోమవారం వాదనలు కొనసాగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని