Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at nine am
close
Updated : 24/08/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. రూ. 40 లక్షలుంటేనే ఫ్లాటు!

రవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగరంలో మధ్యతరగతికి సొంతింటి కల సుదూర స్వప్నంగానే మిగులుతోంది. కొనుగోలు సామర్థ్యం, ఇళ్ల ధరల మధ్య అంతరం ఏటేటా పెరుగుతూనే ఉంది. దూసుకెళుతున్న స్థిరాస్తి ధరలకు తోడు పెరిగిన పన్నులు, రిజిస్ట్రేషన్లు, మౌలికవసతుల అదనపు బాదుడు.. వెరసి మహానగరపాలిక పరిధిలో ఎటు వెళ్లినా రూ.40 లక్షలలోపు ఫ్లాట్‌ దొరికే పరిస్థితి కనిపించటం లేదు. హైదరాబాద్‌ చుట్టూ 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కనీసం రూ.అరకోటి పెడితే తప్ప 1000 చదరపు అడుగుల ఫ్లాట్‌ కొనలేని పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇవి మన ఒలింపిక్స్‌!

ఒలింపిక్స్‌ ఎన్ని సంవత్సరాలకోసారి జరుగుతాయి..? అని ఎవరైనా మనల్ని అడిగితే.. వెంటనే మనం.. ‘కరోనా లాంటివి లేకుంటే.. నాలుగు సంవత్సరాలకోసారి’ అని చెబుతాం. కానీ ఏటా జరిగే ఒలింపిక్స్‌ కూడా ఉన్నాయి తెలుసా! అదీ ఎక్కడో విదేశాల్లో కాదు. మన దేశంలోనే..! అవును మీరు చదువుతోంది నిజమే! కాకపోతే ఇవి ‘గ్రామీణ ఒలింపిక్స్‌’. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 30 నిమిషాల్లో 134 వంటకాలు

3. కొవిడ్‌ ముందు మాదిరే ప్రయాణించొచ్చు

రైళ్లలోని జనరల్‌ బోగీల్లో ఇక కొవిడ్‌కు ముందు మాదిరే ప్రయాణం చేయవచ్చు. రిజర్వేషన్‌ అవసరం లేదు. స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్‌ టికెట్‌ తీసుకుని రైలెక్కి ప్రయాణం చేయవచ్చు. ఈ నిర్ణయం 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని అయితే హైదరాబాద్‌ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలుచేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే సోమవారం తెలిపింది. జోన్‌ పరిధిలోని 74 రైళ్లలో జనరల్‌ బోగీలను రిజర్వేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బూస్టర్‌ డోస్‌ను రెండు నెలలు వాయిదా వేయండి: డబ్ల్యూహెచ్‌వో

కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడంలో ప్రపంచంలో నెలకొన్న అసమానతలను తగ్గించడానికి వీలుగా బూస్టర్‌ డోస్‌పై రెండు నెలల మారటోరియం విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌లో కొత్త రకాలను నివారించాలన్నా ఇలా చేయడం అవసరమని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ ఘెబ్రియేసస్‌ సోమవారం హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రైవేటుకు..

కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ఇక ప్రైవేటుపరం కానుంది. ఈ ఆస్తుల నగదీకరణ (మానిటైజేషన్‌) ద్వారా... నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లు సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌’ను తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 67,820

6. అటు కరోనా.. ఇటు డెంగీ

అసలే కరోనా కాలం. ఆపై జ్వరాల దెబ్బ. ముఖ్యంగా డెంగీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక జ్వరంతో బాధపడుతున్నవారే. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటుండటం మరింత గందరగోళానికి తావిస్తోంది. చికిత్సలు వేర్వేరనే విషయం తెలియక కొందరు నొప్పి మాత్రలనూ ఆశ్రయిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Evaru Meelo Koteeswarulu: రామ్‌ చరణ్‌- ఎన్టీఆర్‌ మధ్యలో రానా.. 

బుల్లితెర కార్యక్రమం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వేదికగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న ఈ షోకి తొలి కంటెస్టెంట్‌గా రామ్‌ చరణ్‌ విచ్చేశారు. తొలి ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారమై, ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని పంచింది. అదే జోరుని కొనసాగిస్తూ తదుపరి ఎపిసోడ్‌ సోమవారం వచ్చేసింది. రూ.1,60,000 విలువైన ప్రశ్నతో ప్రారంభమైన తాజా ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అప్పటి ప్రవర్తనకు బౌచర్‌ క్షమాపణలు!

తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో జాతివివక్షకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా కోచ్‌ మార్క్‌ బౌచర్‌ స్పందించాడు. నల్లజాతి సహచరులను అవమానించేలా పాటలు పాడి, వారిని మారుపేర్లతో పిలిచిన గుంపులో భాగమైనందుకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు అతడు క్రికెట్‌ దక్షిణాఫ్రికా సోషల్‌ జస్టిస్‌ అండ్‌ నేషన్‌ బిల్డింగ్‌ కమిటీకి 14 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వైకల్యాన్ని ధిక్కరించి... జీవితాన్ని గెలిచి...

9. వనరులు పుష్కలం... ప్రగతి శూన్యం

మెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల పునరాగమనంతో ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు అఫ్గానిస్థాన్‌ వైపు మళ్ళింది. ఇంతకాలం అఫ్గాన్‌ ఖనిజ సంపదను, ఇతర వనరులను అక్రమంగా అనుభవిస్తూ వచ్చిన తాలిబన్లకు ఇక వాటిని సాధికారికంగా చేజిక్కించుకొనే అవకాశం దక్కింది. ఆ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాలిబన్లు దేశంపై తమ ఉచ్చును మరింత బిగించేందుకు, దక్షిణాసియాలో అశాంతికి ఆజ్యం పోసేందుకు వినియోగిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం ఆందోళన రేపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జుట్టుకూ తిండి

జుట్టు పెరగటానికి ప్రత్యేకించి ఆహారమేదీ ఉండకపోవచ్చు. కానీ కొన్ని పోషకాలు వెంట్రుకలకు మేలు చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి లభించే పదార్థాలను తెలుసుకొని, ఆహారంలో భాగం చేసుకోవటం ఎంతైనా మంచిది. ఒమేగా3 కొవ్వు ఆమ్లాలను మన శరీరం తయారుచేసుకోలేదు. వీటిని ఆహారం లేదా మాత్రల రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని