Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at nine am
close
Updated : 25/08/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ‘బాంబే హైకోర్టు తీర్పు హానికరం’

‘‘బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్‌ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదు’’ అంటూ... బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ తీర్పు హానికరమైనదని, అనేక ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు (నాగ్‌పుర్‌ ధర్మాసనం) ఈ ఏడాది జనవరిలో తీర్పు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌లో ఎండెమిక్‌ దశకు కొవిడ్‌

భారత్‌లో కొవిడ్‌ ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి (ఎండెమిక్‌) దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. సెప్టెంబరు మధ్య నాటికి భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక బృందం ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు. ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జెన్నోవా టీకా 2, 3 దశల ప్రయోగాలకు సమ్మతి

3. బరువు పెరిగామా? తగ్గామా?

మనుషులకేనా ఆరోగ్య సంరక్షణ స్పృహ అంటూ బరువు తూచే యంత్రంపై ఠీవీగా నిలుచున్న ధ్రువపు జింక.. బరువు పెరిగితే ఎగరగలమో లేదో అని గాబరా పడుతున్న మకావు చిలుకలు.. ఇలా ఇవన్నీ ఒక్కసారిగా బరువు తూచే యంత్రాల వద్దకు చేరాయనేగా మీ సందేహం! బ్రిటన్‌లోని డాన్‌స్టబుల్‌లో ఉన్న విప్స్‌నేడ్‌ జూలో జంతువులు, పక్షుల బరువు, పొడవు నమోదు చేస్తారు. మంగళవారం కూడా సిబ్బంది ఈ వివరాలు సేకరించారు. వాటి ఆరోగ్య సంరక్షణపై ఆ దేశం తీసుకుంటున్న శ్రద్ధకు ప్రతీకగా నిలిచే చిత్రాలివి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లాండ్రీతో ఏటా రూ.మూడుకోట్లు!

ఏదైనా భిన్నంగా చేయాలి... పదిమందికీ ఉపాధిని కల్పించాలి అన్న ఆలోచనలే ఆమెను వ్యాపార దిశగా నడిపించాయి.  అవకాశాల్ని సృష్టించుకుంటూ, అవరోధాల్ని అధిగమిస్తూ లాండ్రీ సర్వీసు సేవలతో తనదైన ముద్ర వేశారామె. నిరక్షరాస్య మహిళలకు ఉద్యోగాల్ని కల్పించి వ్యాపారవేత్తగా నిలదొక్కుకున్నారు. ఆవిడే విజయవాడకు చెందిన భీమవరపు పద్మ. తన గురించి వివరించారిలా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రైవేటు అజమాయిషీలోకి..

రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతీయ రహదార్లు, ఇతర మౌలిక ప్రాజెక్టులు వచ్చే నాలుగేళ్లలో ప్రైవేటు అజమాయిషీ కిందకు వెళ్లిపోనున్నాయి. దీంతో రానున్న మూడేళ్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు రూ.6 లక్షల కోట్లు సమీకరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థల నిర్వహణకు అప్పగించాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గ్రామాల్లో రూ. 15 వేలు.. నగరాల్లో రూ. 20 వేలు

 రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫారసును ఆమోదిస్తూ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్‌ రెండేళ్ల కోర్సులకు సంబంధించి 2021-22 నుంచి 2023-24 వరకు ఇవి వర్తిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వ్యక్తిగత దూరం లేనట్టేనా!

7. రూ.5 కోట్లకు గురి..రూ.25 లక్షలు హరీ!

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటూ ఆన్‌లైన్‌లో సాగే వ్యవహారాలన్నీ మోసాలని..వాటిలో పెట్టుబడులు పెట్టి డబ్బులు నష్టపోవద్దంటూ ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు పోలీసులు చేసిన హితబోధ బూడిదలో పోసిన పన్నీరైంది. అత్యాశకు పోయిన ఆ మహిళ ఇంటికి వెళ్లి సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి రూ.25.50 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వెలుగు చూసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జోరుగా.. హుషారుగా..

మంచి అవకాశాన్ని సృష్టించుకున్నా...వర్షం కారణంగా మొదటి టెస్టులో విజయాన్ని అందుకోలేకపోయింది. విపత్కర పరిస్థితులను దాటుకుంటూ.. అద్భుత పోరాటంతో లార్డ్స్‌ టెస్టును చేజిక్కించుకుంది. అటు బౌలింగ్‌లోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ ఇప్పటివరకు ఆతిథ్య జట్టుపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అందుకే కోహ్లీసేన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. రెట్టించిన విశ్వాసంతో మరో సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే మూడో టెస్టు. భారత బృందానికి కొన్ని ఇబ్బందులున్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘టులెట్‌’కు రూ.2 వేల జరిమానా

వ్యాపార, వాణిజ్య, నివాస ఇల్లు వంటివి ఏవైనా అద్దెకు ఇవ్వాలనుకుంటున్నారా? ఇకపై ఆ అంశాల పేరుతో ఏర్పాటు చేసే బోర్డులు, గోడపత్రికలకు జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించనున్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ఇటువంటి బహిరంగ ప్రచారాలపై ఇప్పటికే నిషేధం ఉందనే విషయం చాలామందికి తెలియదు. మూసాపేట డివిజన్‌ పరిధిలోని ఓ దుకాణ యజమాని ఏర్పాటు చేసిన ‘టు లెట్‌’ స్టిక్కర్‌కు అధికారులు రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తాఖీదు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు

సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల జాతీయరహదారిపై వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మునగాల పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 33 మంది ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Crime News: వేగంగా వెళ్తున్న ఆటో నుంచి జారి పడి నలుగురి దుర్మరణంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని