Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at nine am
close
Updated : 31/08/2021 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మరో ప్రమాదకర వేరియంట్‌

ప్రపంచం నెత్తిన మరో కరోనా వేరియంట్‌ వచ్చి పడింది. దీనికి ఎక్కువ సాంక్రమిక శక్తి, టీకాల ద్వారా లభించే రక్షణను ఏమార్చగల సామర్థ్యం ఉన్నాయని వెల్లడైంది. దక్షిణాఫ్రికాతో పాటు అనేక దేశాల్లో దీన్ని గుర్తించారు. ఈ కొత్త రకాన్ని ‘సి.1.2’గా పిలుస్తున్నారు. దీన్ని ‘దృష్టిపెట్టాల్సిన రకం’ (వీవోఐ)గా వర్గీకరించారు. దీనిలో ఉత్పరివర్తన రేటు చాలా ఎక్కువగా ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* యాంటీబాడీలు తగ్గినా.. రక్షణ తగ్గదు

2. కుదరని బేరం... జిన్నా ఖేదం

దేశ విభజన విషయంలో పట్టుబట్టి సఫలమైన మహమ్మద్‌ అలీ జిన్నా... తన ఇల్లు అమ్మకం విషయంలో మాత్రం విఫలమయ్యారు. ముంబయిలో అరేబియా సముద్రానికి అభిముఖంగా... రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మలబార్‌ హిల్‌ సౌత్‌కోర్టు బంగ్లాకు రూ.17 లక్షల బేరం వస్తే... 20 లక్షలు కావాలంటూ పట్టుబట్టారు జిన్నా! మూడు లక్షల కోసం చూసుకున్న జిన్నా కోరిక నేటికీ తీరలేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సర్దుబాటు షాక్‌

సలే కరోనా ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఇవి చాలవన్నట్లు ప్రజలపై విద్యుత్తు భారం పడనుంది. సర్దుబాటు వ్యయం పేరిట వినియోగదారులకు బిల్లుల షాక్‌ తగలనుంది. నెలవారీ విద్యుత్‌ వినియోగం ఆధారంగా వారిపై అదనపు ఛార్జీల భారం పడనుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీపీఏస్సీ నోటిఫికేషన్లేవీ?

4. అఫ్గాన్‌ను వీడిన అమెరికా చివరి విమానం.. సంబరాలు చేసుకున్న తాలిబన్లు 

అమెరికా రక్షణ దళాలతో కూడిన చివరి విమానం అఫ్గానిస్థాన్‌ నుంచి సోమవారం అర్ధరాత్రి బయలు దేరింది. దీంతో అఫ్గాన్‌ గడ్డ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ప్రకటించింది. సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్‌ సీ-17 కాబుల్‌లోని హమీద్‌ కార్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై వీడని ఉత్కంఠ

ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ ప్రవేశాలపై హైకోర్టు తీర్పును రిజర్వు చేయడం.. మరోపక్క ఆన్‌లైన్‌ దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియడం, ఇంకోపక్క వచ్చే నెల నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. న్యాయస్థానం ఆదేశాల కోసం వేచి చూస్తున్న కొందరు ఇంతవరకు దరఖాస్తు చేయలేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరింత కఠినంగా ఎన్‌టీఎస్‌ఈ

6. ఓటీటీపై అగ్ర తారంగేట్రం

ది ఓటీటీ వేదిక, అది థియేటర్‌ అని కాకుండా.. రెండూ కలిసిపోయిన కొత్త రోజులివి. ఓటీటీలో విడుదలైనా.. థియేటర్లో విడుదలైనా కథా బలమున్న దృశ్యమాలికలకు ప్రేక్షకుల నుంచి ఒకే రకమైన ఆదరణ దక్కుతోంది. అందులో చేసిన నటీనటుల ప్రతిభకు అంతే చక్కటి గుర్తింపు లభిస్తోంది. అందుకే నిన్నమొన్నటి వరకు ఓటీటీల వైపు అడుగేయడానికి ఆలోచించిన అగ్ర కథానాయకులు సైతం ఇప్పుడు ఆ వైపు గురి పెడుతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాసులు కురిపిస్తారు!

డబ్బంటే ఎవరికి చేదు..? కానీ పెట్టుబడి పాఠాలే ఓ పట్టాన కొరుకుడు పడవు. ఇప్పుడా చింత లేదు. సామాన్యులకు అర్థమయ్యేలా... స్టాక్‌మార్కెట్‌ పండితులకు ఉపయోగపడేలా సోషల్‌మీడియా అడ్డా అయ్యింది.  ఈ అమ్మాయిలు డబ్బు పాఠాలతో ఈ మార్గంలోనే లక్షలాదిమందికి  చేరువయ్యారు. దేశవ్యాప్తంగా ‘ఫిన్‌ఫ్లూయ్యర్స్‌’గా పేరు సంపాదించుకున్న వీళ్ల గురించి తెలుసుకుందాం..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రదీప్‌ నర్వాల్‌కు రూ.1.65 కోట్లు

8. Supreme court: అభియోగాలు లేకుండా 11 ఏళ్లు జైలులోనా?

‘‘శిక్షయినా వేయండి..లేదంటే విడిచిపెట్టేయండి. అంతేకానీ కనీసం అభియోగాలు నమోదు చేయకుండా 11 ఏళ్ల పాటు జైలులో ఉంచుతారా?’’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్వర విచారణ నిందితుల హక్కు అని స్పష్టం చేసింది. ఇలా ఎందుకు జరిగిందో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ట్రయల్‌ కోర్టు జడ్జికి నోటీసు పంపించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ఇటీవల పై నిర్ణయం తీసుకొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మరిదితో ఇబ్బందిగా ఉంది...

నా పెళ్లై రెండేళ్లయింది. మావారి తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు. అతని చూపులు, చేష్టలూ తేడాగా ఉంటాయి. ఇన్నాళ్లూ అత్తయ్యగారు ఉంటే ఫరవాలేదు. ఇప్పుడు ఆడపడుచు ప్రసవం కోసమని ఆవిడ దిల్లీ వెళ్లారు. మా వారు లేని సమయంలో అతను ఇంట్లో ఉంటే చిరాగ్గా భయంగా ఉంటుంది. ఆయనకు చెప్పబోతే నాది కేవలం అనుమానమని, తన వాళ్లని దూరం చేయాలని చూస్తున్నానని నన్నే తప్పుపట్టారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Hyderabad News: తల్లితో సహ జీవనం.. కుమార్తెపై లైంగిక దాడి

10. South Central Railway: పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు

కాజీపేట-కొండపల్లి సెక్షన్ల మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతోందని దక్షిణమధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘గుంటూరు-సికింద్రాబాద్‌ (02705), సికింద్రాబాద్‌-గుంటూరు(02706) రైళ్లు సెప్టెంబరు 9న, డోర్నకల్‌-విజయవాడ(07755), విజయవాడ-డోర్నకల్‌ (07756) రైళ్లు సెప్టెంబరు 2, 3, తేదీల్లో రద్దయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని