Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at nine am
close
Updated : 03/09/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. టీకాలకు లొంగేలా లేదు

కొలంబియాలో వెలుగుచూసిన ఎంయూ రకం కరోనా వేరియంట్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక వ్యాఖ్యలు చేసింది. వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా పరిగణిస్తున్న ఈ ఉత్పరివర్తనం ఇప్పుడున్న టీకాలకు లొంగేలా లేదని చెప్పింది. సాంకేతికంగా బి.1.621 గా పిలుస్తున్న ఈ వేరియంట్‌ను తొలిసారిగా ఈఏడాది జనవరిలోనే గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇక్కడ వికెట్లు ఉచితం

వికెట్లు అప్పనంగా ఇచ్చేయడం ఎలా..? ఈ విషయంలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌కు మించి సలహాలు ఇచ్చే వారుండరేమో! ఎందుకంటారా? ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వారి బ్యాటింగ్‌ చూస్తే అర్థమైపోతుంది. వారు ఔటైన తీరు గమనిస్తే తెలిసిపోతుంది. ఓవల్‌ పిచ్‌పై పెద్దగా పచ్చిక లేదు. ప్రమాదకర స్వింగ్‌ కనిపించలేదు. అయినా ఒక్కరూ నిలబడేందుకు చూడలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పడ్డా.. కాస్త ఆశ

3. ఆగ ‘మేఘం’.. ఆగమాగం

హానగర వీధుల్ని మరోసారి వరద ముంచెత్తింది. గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా కురిసిన జోరువానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 7గంటల నుంచి చిరుజల్లులుగా మొదలై 15నిమిషాల్లోనే దాదాపు 3.5సెంటీమీటర్ల వాన నగరవ్యాప్తంగా కురిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జేఈఈ (మెయిన్స్‌) పరీక్షల్లో అక్రమాలు

జేఈఈ (మెయిన్స్‌) పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై ‘ఎఫినిటీ ఎడ్యుకేషన్‌ ప్రై.లి.’ సంస్థపై, దాని డైరెక్టర్లపై దేశంలో 20 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. దిల్లీ, పుణె, ఇండోర్‌, బెంగళూరు, జంశెద్‌పుర్‌లలో ఈ సోదాలు కొనసాగాయి. సంస్థ సిబ్బందితో పాటు దళారులపైనా కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్‌.సి.జోషి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజధాని భూములపై ఏసీబీ కేసు కొట్టివేత

రాజధాని భూముల కొనుగోలుకు సంబంధించి గతేడాది సెప్టెంబరు 15న మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, మరి కొందరిపై అవినీతి నిరోధకశాఖ (అనిశా) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం కీలక తీర్పు ఇచ్చారు. ‘ప్రైవేటు వ్యక్తుల మధ్య ఆరేళ్ల కిందట జరిగిన భూముల క్రయవిక్రయాలను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు వర్తింపజేస్తూ నేరపూర్వక విషయంగా ప్రాసిక్యూషన్‌ పేర్కొంటున్న ప్రత్యేకమైన కేసుగా ఇది కనపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* విశాఖలో రూ.100 కోట్ల భూమిపై కన్ను.. హతాశుడైన అమెరికాలోని భూయజమాని

6. క్రెడిట్‌ కార్డుతో కష్టం కాకుండా...

కొవిడ్‌-19 తర్వాత డిజిటల్‌ చెల్లింపులు అధికం కావడం, ఇతర కారణాలతో క్రెడిట్‌ కార్డు వాడకం ఒక్కసారిగా పెరిగింది. అయితే, కొంతమంది దీని వాడకంలో కొన్ని పొరపాట్లూ చేస్తున్నారు. చేతిలో డబ్బు లేకున్నా.. ఖర్చు చేసే వెసులుబాటు కల్పించే ఈ కార్డులతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. సాధారణంగా ఈ కార్డులను వాడేటప్పుడు ఉండే సందేహాలు.. వాటికి సమాధానాలేమిటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అఫ్గాన్‌లో ఆకలి కేకలు

కాబుల్‌: అఫ్గాన్‌లో భయాందోళనలకు... ఇప్పుడు ఆకలి కూడా తోడైంది! తాలిబన్ల దురాక్రమణతో కకావికలమైన దేశం... క్షుద్బాధతో అల్లాడుతోంది. లక్షల మందికి కడుపు నిండా తిండి దక్కని పరిస్థితి తలెత్తింది. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద అఫ్గాన్‌కు అందించిన నిల్వలు ఈ నెలకు మాత్రమే సరిపోతాయని ఐరాస హెచ్చరించింది. ఆ తర్వాత నిరుపేదల క్షుద్బాధను తీర్చలేమని అఫ్గాన్‌లోని ఆ సంస్థ మానవతా విభాగం అధ్యక్షుడు రమీజ్‌ అలక్‌బరోవ్‌ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Tamil Nadu: తమిళనాడులో ఆధార్‌, టీకా పత్రం ఉంటేనే మద్యం

ఆధార్‌ కార్డు, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే మద్యం విక్రయించే విధానాన్ని మొదటిసారిగా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా.. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా పత్రం చూపాలని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి విక్రయాలు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భూగర్భంలో వీర వనిత

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆకాంక్ష కుమారి అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే తొలి అండర్‌గ్రౌండ్‌ మహిళా మైనింగ్‌ ఇంజినీర్‌గా రికార్డుకెక్కారు. పురుషులకే సవాల్‌ విసిరే ఈ రంగంలో సత్తా చాటుతూ.. అతివల ఆత్మవిశ్వాసాన్ని చాటిచెబుతున్నారు. బార్కాగావ్‌ గ్రామంలో నివాసం ఉండే ఆకాంక్ష కుమారి.. బిర్సా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి మైనింగ్‌ ఇంజినీరింగ్‌ పట్టా సంపాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నీట మునిగిన న్యూయార్క్‌

10. కెల్విన్‌కు డబ్బు పంపారా? ఛాటింగ్‌ చేశారా?

తెలుగు సినీ పరిశ్రమ మత్తుమందుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. గత నెల 31న సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విచారణకు హాజరు కాగా.. గురువారం నటి ఛార్మి ఈడీ కార్యాలయానికి వచ్చారు. తన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌తో కలిసి వచ్చిన ఆమెను అధికారులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. కార్యాలయంలోని మూడో అంతస్తులో ఈడీ సంయుక్త సంచాలకుడు అభిషేక్‌ గోయల్‌ నేతృత్వంలోని బృందం విచారించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని