Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at nine am
close
Updated : 06/09/2021 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. అమ్మేది మోదీ.. కొనేది అంబానీ, అదానీ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఆదివారం చేపట్టిన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’ విజయవంతమైందని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూపీతోపాటు హరియాణా, పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి 300 సంఘాలకు చెందిన వేల మంది రైతులు తరలివచ్చినట్లు తెలిపింది. కర్షక నేత రాకేశ్‌ టికాయిత్‌తో పాటు మేధా పాట్కర్‌, యోగేంద్ర యాదవ్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇటా.. అటా!

ఆసక్తికరంగా ఓవల్‌లో పోరు. బ్యాటుతో బలంగా పుంజుకున్న టీమ్‌ఇండియా బలమైన స్థితిలో నిలిచింది. శార్దూల్‌, పంత్‌ జోడీ ఆశలు రేకెత్తించింది. అయినా సమతూకంగానే ఆట అయిదో రోజుకు చేరుకుంది. బ్యాటింగ్‌ మరింత తేలికైన నిర్జీవమైన పిచ్‌పై నాలుగో టెస్టు ఎలా ముగుస్తుందన్నది ఇంకా అంచనా వేయలేని పరిస్థితి. ఇంగ్లాండ్‌ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. 368 పరుగుల లక్ష్యంలో ఆ జట్టు అప్పుడే 77 పరుగులు సాధించింది. చివరి రోజు నెగ్గాలంటే.. భారత్‌ 10 వికెట్లు తీయాలి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఔరా..పారా వీరా!

3. వాతావరణశాస్త్ర కోర్సు ఎక్కడ?

మీటీయొరాలజీ కోర్సులో వాతావరణ పరిశీలనల రికార్డింగ్‌, వాతావరణ డేటాను విశ్లేషించడం, వాతావరణ వ్యవస్థల అంచనాకు కావాల్సిన సాంకేతికత పరికరాలపై శిక్షణ అందిస్తారు. వీటితో పాటుగా ఉష్ణమండల తుపానులు, పట్టణ వరదలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు, కరువు, భూకంపాలు, వేడి తరంగాలు, చల్లని తరంగాలు, రిమోట్‌ సెన్సింగ్‌, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌), వాతావరణ రాడార్లు, వాతావరణ ఉపగ్రహాల ప్రత్యేకత, రోజువారీ వాతావరణ మార్పులు, భూతాప ప్రభావాల గురించీ నేర్చు కొంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Covid Vaccine: టీకాలకూ నకిలీ మకిలి.. గుర్తింపునకు కేంద్రం మార్గదర్శకాలు

అంతర్జాతీయ మార్కెట్‌లో నకిలీ కొవిషీల్డ్‌ టీకాలను అక్రమార్కులు వ్యాప్తి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. ఈ అంశంపై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో వినియోగంలో ఉన్న కొవిడ్‌ టీకాలు నిజమైనవా.. కావా.. అన్నది తేల్చేందుకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్ల తయారీదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వీటిని రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 75 ఏళ్లు దాటిన వారికి ఐటీ రిటర్నులు అక్కర్లేదు

2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 75 ఏళ్లు దాటిన వయో వృద్ధులు, ఐటీ రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు పొందేందుకు అవసరమైన వాంగ్మూల పత్రాలను ఐటీ విభాగం నోటిఫై చేసింది. 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ‘పింఛను ఆదాయం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ ఒకే బ్యాంకు నుంచి పొందుతుంటే’ వారు 2021 ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పెట్రోపై రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం

6. దక్షిణాది చిత్రాలకు ప్రపంచం ఫిదా

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నారా? ఇక్కడ ఎక్కువగా పాన్‌ఇండియా లక్ష్యంగా ప్రాజెక్టులు ఎందుకు రూపొందుతున్నాయి? హాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులకు దక్షిణ భారతదేశ చిత్రాల్లో ముఖ్యపాత్రలు ఎలా లభిస్తున్నాయి? దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఇక్కడి సినిమాలపై ఆసక్తి ఎందుకు పెరుగుతోంది? ఇంటర్నెట్‌లో ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్ర వివరాల కోసం ఎందుకు వెదుకుతున్నారు?... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మద్య నిషాధం

రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా విక్రయాల పెంపుపై దృష్టి సారించింది. రూ.80 నుంచి రూ.100 మధ్య ధరకు 90 మిల్లీలీటర్ల (ఎంఎల్‌) పరిమాణంలో ఉండే సీసాలను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు కనీసం 10వేల కేసులను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. క్రమంగా ఈ లక్ష్యాన్ని పెంచాలని నిర్ణయించింది. తక్కువ పరిమాణమున్న మద్యాన్ని తక్కువ ధరలో లభ్యమయ్యేలా చేయడం ద్వారా ఎక్కువ మంది కొనేలా చేసి అమ్మకాలను పెంచుకునేందుకే ఏపీఎస్‌బీసీఎల్‌ వీటిని ప్రవేశపెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. MBBS: పూజలు చేస్తే పాస్‌!

మీరు పరీక్షలో పాస్‌ కావాలంటే ఏం చేస్తారు..? కష్టపడి చదువుతారు. కానీ.. ఓ ఎంబీబీఎస్‌ పట్టభద్రురాలు ఏం చేసిందో తెలుసా..? ఓ స్వామిజీని నమ్ముకుంది. పూజలు చేస్తే చాలూ.. పాస్‌ అయిపోతావని ఆ కేటుగాడు చెప్పిన మాటలను నమ్మి రూ.80 వేలు సమర్పించుకుంది. తర్వాత రెండు సార్లు ఫెయిల్‌ కావడంతో లబోదిబోమంటూ సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Love: ముక్కోణపు ప్రేమకథకు లాటరీతో ముగింపు

9. గుండె పిండేస్తోంది 

మారుతున్న జీవనశైలి గుండె జబ్బులకు, మరణాలకు కారణమవుతోంది. మొత్తం వైద్య ధ్రువీకరణ మరణాలకు కారణాలను విశ్లేషిస్తే.. శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ సమస్యలవల్ల సంభవించే మరణాలే అత్యధికమని స్పష్టమైంది. ఈ కారణంగా దేశంలో 32.7 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది. అత్యధికంగా లక్షద్వీప్‌ 63.7 శాతంతో ముందుండగా.. డామన్‌, డయ్యూ 59.9 శాతంతో రెండోస్థానంలో, తెలంగాణ 56 శాతంతో మూడోస్థానంలో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమెరికాలో కాల్పులు.. బాలింత, శిశువు సహా 11మంది మృతి

అమెరికాలో తుపాకీ సంస్కృతి ప్రాణాలు తోడేస్తోంది. శని, ఆదివారాల్లో మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందారు. ఫ్లోరిడాలోని లేక్‌ ల్యాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో స్వైరవిహారం చేయడంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ బాలింత, ఆమె ఒడిలో ఒదిగిన శిశువు కూడా ఉన్నారు. బుల్లెట్‌ప్రూఫ్‌ దుస్తులు ధరించిన సైకో జరిపిన కాల్పుల్లో లేక్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో 11 ఏళ్ల బాలిక, బాలింత, ఆమె ఒడిలోని శిశువు మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని