Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at nine am
close
Published : 18/09/2021 08:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. బ్రహ్మోస్‌ రహస్యాలు లీకయ్యాయా?

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందిపూర్‌ ఆయుధ పరిశోధన కేంద్రం డీఆర్‌డీవో నుంచి రహస్యాల లీకులపై ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ డీజీపీ బిపిన్‌ బిహారీ మిశ్రా శుక్రవారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ దేశంలోని శ్రీహరికోట, బాలేశ్వర్‌ ఆయుధ పరిశోధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. అత్యాధునిక ఆయుధాల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పాన్‌-ఆధార్‌ అనుసంధాన గడువు 2022 మార్చి

2. Vaccine: టీకాలను సాగు చేసుకొని.. తినేయొచ్చు!

భవిష్యత్‌లో టీకాలు వేయించుకోవడం సలాడ్‌ తిన్నంత సులువు కాబోతోంది. లెటూస్‌ వంటి మొక్కలను ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ కర్మాగారాలుగా మార్చే సరికొత్త విధానంపై అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ) పరిజ్ఞానంతో కొన్ని కొవిడ్‌-19 టీకాలు తయారైన సంగతి తెలిసిందే. అవి అంటువ్యాధులను కలిగించే వైరస్‌లను గుర్తించి, వాటి నుంచి రక్షణ కల్పించేలా మన కణాలకు శిక్షణ ఇస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నడిరోడ్డులో గవర్నర్‌ జనరల్‌ డిష్షుం డిష్షుం

వారెన్‌ హేస్టింగ్స్‌... భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనకు పునాది వేసిన ముఖ్యుల్లో ఒకరు. బ్రిటిష్‌ ఇండియాలో బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ కూడా! ఈస్టిండియా ప్రభుత్వంలో అత్యంత ఉన్నత హోదాలో ఉన్న హేస్టింగ్స్‌ ఓ రోజు నడివీధిలో తన సహచరుడితో పిస్తోళ్లతో వీధి పోరుకు దిగారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. కారణం అవినీతి ఆరోపణలు... అహంభావాలు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Virat Kohli: కోహ్లి.. రోహిత్‌ను తప్పించాలనుకున్నాడా?

 ప్రపంచకప్‌ తర్వాత టీ20 పగ్గాలు వదిలేయబోతున్నట్లు కోహ్లి చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించాలని సెలక్టర్లను కోహ్లి కోరినట్లు తెలుస్తోంది. ‘‘34 ఏళ్ల రోహిత్‌ను వైస్‌ కెప్టెన్సీ  నుంచి తొలగించి.. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా కేఎల్‌ రాహుల్‌కు ఇవ్వాలని సెలక్షన్‌ కమిటీకి ముందు కోహ్లి ప్రతిపాదించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పాక్‌కు షాక్‌

5. Prison: చిన్నపిల్లల నీలి చిత్రాలు చూస్తే..? నేరుగా జైలుకే!

చిన్నపిల్లలతో అసహజంగా చిత్రీకరించిన నీలిచిత్రాలు చూస్తున్న వారు నేరుగా జైలుకే వెళ్తున్నారు. ఎక్కడున్నా సరే వారిని పోలీసులు వెంటాడి, వేటాడి మరీ పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. నాలుగైదేళ్లుగా మైనర్లతో చిత్రీకరించిన నీలిచిత్రాల వెబ్‌సైట్లను వీక్షించే వారి సంఖ్య పెరుగుతుండడం, వీటి ప్రభావంతో చిన్నారులు, మైనర్లపై అకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రేషన్‌ కార్డుల్లో ‘మ్యుటేషన్‌’కు మోక్షమెప్పుడు?

పౌరసరఫరాల శాఖలో ‘మ్యుటేషన్‌’ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. కొత్త రేషన్‌ కార్డులను జారీ చేసిన అధికారులు.. వీటివైపు కన్నెత్తి చూడటం లేదు. ఏళ్లు గడుస్తున్నా పరిష్కరించకపోవడంతో లక్షల మంది పౌరసరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే తప్ప తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తుండటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90.5 లక్షల కార్డులున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏ వయసులో ఇల్లు కొనడం కలిసొస్తుంది?

నగరంలో సొంతిల్లు ఉండాలని కోరుకోనివారు అరుదు. ఎవరి స్థాయిలో వారు కలల గృహాన్ని కట్టుకుంటుంటారు.. కట్టిన ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేస్తుంటారు. ఏ వయసులో ఇల్లు కొనడం, కట్టడం సరైంది? అంతమేర పెట్టుబడి సమకూర్చుకోవడం సాధ్యమేనా?చదువు పూర్తిచేసుకుని కోరుకున్న రంగంలో ఉద్యోగం సంపాదించి, కుదురుకునే సరికి వయసు పాతిక వచ్చేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నువ్వు లేవన్నది అబద్ధం చెయ్‌రా..

8. ఇంటర్‌ పరీక్షలపై పరేషాన్‌

‘‘ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తాం.. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి’’ అని ప్రకటించిన ప్రభుత్వం.. పరీక్షల కాలపట్టిక ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా దాదాపు 4.74 లక్షల మంది విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా గత మే నెలలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆదాయమే అన్నింటికీ మూలం!

దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం’పై కేంద్రం పెదవి విరిచింది. పలు రాష్ట్రాలు అందుకు సుముఖంగా లేవని చెబుతోంది. ఇంతకీ దీనిపై రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరమేమిటి? కేంద్రం ఎందుకు కాదంటోంది? పరిశీలిస్తే ఒకటే విషయం స్పష్టమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తాము భారీగా ఆదాయం కోల్పోవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రం, రాష్ట్రాలు ఇందుకు సుముఖత చూపడం లేదని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అవకాశాలు.. పెరిగినాయిక

చిత్రసీమలో కథానాయికలెవ్వరూ ఖాళీగా కనిపించడం లేదు. వాళ్లకు వాళ్లుగా కొంచెం విరామం కావాలి అనుకుంటే తప్ప అందరికీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. కథానాయకులతోపాటు... వాళ్లు చేస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతుండడంతో నాయికలకి వద్దన్నా అవకాశాలే. కనుమరుగైన భామలు కూడా మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. విరమణకి సిద్ధమైన భామలూ ‘ఇంకొన్ని సినిమాలు చేస్తే పోలా’ అంటూ మళ్లీ మేకప్‌ వేసుకుంటున్నారు. ఇక స్టార్‌ భామలు.. కమర్షియల్‌ నాయిక అనే ముద్రపడిన తారలైతే మరింతగా జోరు ప్రదర్శిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఓ చిన్న ఆలోచన.. 400 కోట్ల వ్యాపారం!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని