Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at nine am
close
Updated : 14/09/2021 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనంపై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం! 

ట్యాంక్‌బండ్‌లో పీవోపీ (ప్టాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌) వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిమజ్జనానికి సంబంధించి ఇచ్చిన తీర్పులోని అంశాలను సవరించాలన్న విజ్ఞప్తికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అదనపు రుసుము చెల్లిస్తే.. గ్రీన్‌ కార్డు ప్రాధాన్యం

అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ, గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నవారి ఆశలు ఫలించే అవకాశముంది! వారికి చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కల్పించేందుకు దోహదపడే కొత్త బిల్లును ‘ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ’ ప్రతిపాదించింది. సప్లిమెంటల్‌ ఫీజు చెల్లించిన వారికి శాశ్వత నివాస హోదా కల్పనలో ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. దరాఖాస్తుల రుసుముకు అదనంగా దీన్ని వసూలు చేయాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆధార్‌తో పీఎఫ్‌ ఖాతాల అనుసంధాన గడువు పెంపు

3. ఒకసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ. ప్రయాణం

టాటా ఇంటర్నేషనల్‌ అనుబంధ సంస్థ స్ట్రైడర్‌ సైకిల్స్‌ అర్బన్‌ కమ్యూటర్‌ విభాగంలో రెండు కొత్త ఇ-బైకులను విపణిలోకి విడుదల చేసింది. వోల్టాక్‌ 1.7, కాంటినో ఈటీబీ-100 మోడళ్లకు ప్రారంభధరగా రూ.29,995ను నిర్ణయించింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ ప్రయాణించొచ్చని తెలిపింది. ఏఆర్‌ఏఐ నిబంధనలకు లోబడిన తేలికపాటి బైకు కాంటినో ఈటీబీ-100లో ఏడు స్పీడ్‌లు, 3 రైడ్‌ మోడ్‌లు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టేకాఫ్‌లోనే కుప్పకూలినట్లుంది

వివాహమైన 20 ఏళ్లలో ఒక్కరోజు కూడా కలిసి ఉండని భార్యాభర్తలకు సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. విమానం టేకాఫ్‌ అవుతున్న దశలోనే కుప్పకూలినట్లుగా వీరి పరిస్థితి ఉందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వం, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గర్భంతో ఉన్న భార్యకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌

5. Tollywood Drugs Case: ఎఫ్‌-క్లబ్‌ను ఎందుకు మూసేశారు?

టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో హీరో నవదీప్‌తోపాటు ఎఫ్‌-క్లబ్‌ మేనేజర్‌ హరిప్రీత్‌సింగ్‌ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటలపాటు వారిద్దర్నీ ఈడీ అధికారులు ప్రశ్నించారు. కెల్విన్‌ ముఠాతో నవదీప్‌కు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపైనే అనేక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. నవదీప్‌ చేస్తున్న వ్యాపారాలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను కూడా ముందుగానే తెప్పించి పెట్టుకున్న ఈడీ అధికారులు వాటి గురించి కూలంకషంగా ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కోహ్లి తప్పుకోవడమా..?

20 ప్రపంచకప్‌ అనంతరం విరాట్‌ కోహ్లి వన్డే, టీ20 జట్ల పగ్గాలు వదిలేయనున్నాడని, అతడి స్థానంలో రోహిత్‌ కెప్టెన్‌ కానున్నాడని సోమవారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన కథనం చర్చనీయాంశమైంది. అయితే బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ ఈ వార్తను ఖండించాడు. కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఈ కుర్రాడు.. దమ్మున్నోడు

7. JEE Main: జేఈఈ మెయిన్‌ ఫలితాలపై అయోమయం

జేఈఈ మెయిన్‌ ర్యాంకుల వెల్లడించడంలో జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్నా ఎన్‌టీఏ మాత్రం ర్యాంకులను వెల్లడించే తేదీని స్పష్టం చేయడం లేదు. అధికారికంగా ప్రకటన కూడా జారీ చేయకపోవడంతో విద్యార్థులు ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్‌టీఏ అంటే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కాదని... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కూటి కోసం నీటి విద్యలు!

ఒంటెలు అనగానే మనకు టక్కున ఎడారి, ఇసుక దిబ్బలు గుర్తుకు వస్తాయి. వీటికి ఎడారి ఓడలు అనే పేరు కూడా ఉండనే ఉంది. కానీ గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలోని ఖరాయి ఒంటెలు మాత్రం నీటిలో ఈదగలవు. సముద్రంలోనూ జలకాలాడగలవు! ప్రపంచంలో ఇంకెక్కడా ఒంటెలు ఇలా చేయవు! మరి ఈ ఖరాయి ఒంటెల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గాంధీ మెచ్చిన నినాద ధీరుడు

9. సైదాబాద్‌ ఘటన: నిందితుడిని తప్పించేందుకు స్నేహితుడి సహకారం!

నగరంలో ఆరేళ్ల చిన్నారి పాశవిక హత్యాచార ఘటనపై అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది... ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామంటూ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై పోలీసులను ప్రశ్నిస్తుండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TH Code: ఇప్పుడు చిటికెలో చిరునామా తెలుసుకోవచ్చు...

కొత్త ప్రదేశంలో చిరునామా కనుక్కోవడం ఎంత కష్టమో అందరికీ అనుభవమే. గూగుల్‌ మ్యాప్స్‌ వచ్చాక చాలా వరకు సులభతరం అయినా.. కొన్ని పరిమితులు ఉన్నాయి. పోస్టల్‌ చిరునామాలన్నింటినీ ఇందులో గుర్తించలేం. ఒకే పేరున్న ప్రాంతాలు వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు తెలుసుకోవడం కొంచెం కష్టమే. పైగా ఇది జీపీఎస్‌ కచ్చితత్వంపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ప్రతికూలతలను అధిగమిస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Apple Gadgets: నేడే యాపిల్ ఈవెంట్.. ఏం వస్తున్నాయంటే?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని