సాగర్‌ బరిలో 41 మంది అభ్యర్థులు - total 41 contestants in nagarjunasagar elections
close
Updated : 03/04/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగర్‌ బరిలో 41 మంది అభ్యర్థులు

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్‌ ఈ నెల 17న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ స్థానం కోసం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు ముందే ఊహించారు. దానికి తగ్గట్లుగానే 72 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో వివిధ పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు కూడా ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం 3 రోజుల గడువిచ్చింది. ఈ నెల 1 నుంచి ఇవాళ్టి వరకు నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పంచింది. రెండో రోజున ముగ్గురు, మూడో రోజున 16 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత జానారెడ్డి, తెరాస నుంచి నోముల భగత్‌, భాజపా నుంచి రవికుమార్‌ నాయక్‌ బరిలో ఉన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని