ఇప్పటివరకూ 7.86లక్షల మందికి వ్యాక్సిన్‌ - total 7.86 lakh healthcare workers got covid-19 vaccine jabs till wednesday
close
Published : 20/01/2021 20:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పటివరకూ 7.86లక్షల మందికి వ్యాక్సిన్‌

వ్యాక్సినేషన్‌ గణాంకాలు వెల్లడించిన కేంద్రం

దిల్లీ:  దేశంలో ఐదో రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కేంద్రం వెల్లడించింది. బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకూ దేశంలో 7.86లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్‌ను తీసుకున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం ఒక్కరోజే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షా 12వేల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపింది. ఇందులో కేవలం 10మందికి మాత్రమే స్వల్ప ఇబ్బందులు తలెత్తాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. దిల్లీలో నలుగురు, కర్ణాటకలో ఇద్దరు, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నాని తెలిపారు.  భారత్‌లో పెద్దఎత్తున జరుగుతున్న కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇప్పటివరకూ ఎవరూ తీవ్ర అస్వస్థతకు గురవ్వలేదని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి..

శశికళకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్‌ దంపతులు..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని