భారత్‌లో 71కి చేరిన యూకే కరోనా కేసులు - total 71 uk variant cases in india: health secretary
close
Published : 05/01/2021 18:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 71కి చేరిన యూకే కరోనా కేసులు

దిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 71కి చేరిందని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బయో టెక్నాలజీ విభాగ కార్యదర్శి రేణు స్వరూప్‌ వెల్లడించారు. మంగళవారం ఉదయానికి 20 కేసులు పాజిటివ్‌ కేసులు పెరిగి మొత్తం సంఖ్య 58గా ఉంది. కాగా సాయంత్రానికి మరో 13 కేసులు పెరిగి 71కి చేరింది. సాధారణ కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా యూకే నుంచి వచ్చిన కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటంపై ఆందోళన పెరుగుతోంది. యూకేలో వెలుగుచూసిన వైరస్‌ త్వరితంగా వ్యాప్తి చెందుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్‌ వచ్చిన వారి సహ ప్రయాణీకులు, కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్స్ట్‌ను గుర్తించి వారికీ పరీక్షలు జరుపుతున్న కేంద్రం తెలిపింది. పాజిటివ్‌ వచ్చిన వారందర్నీ ఆయా రాష్ట్రాల్లో ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం గతంలో వెల్లడించింది.

ఇవీ చదవండి..

కరోనా టీకా: సీరం, బయోటెక్‌ సంయుక్త ప్రకటన

బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన రద్దుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని