‘రాధేశ్యామ్‌’లో ఆ సెట్‌ ఖరీదు ఎంతంటే? - train set in prabhass radhe shyam first glimpse costs rs 16 crore
close
Published : 18/02/2021 19:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’లో ఆ సెట్‌ ఖరీదు ఎంతంటే?

హైదరాబాద్‌: ప్రభాస్‌, పూజాహెగ్దే జంటగా ‘రాధేశ్యామ్’ పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమాదిత్యగా ప్రభాస్‌, ప్రేరణగా పూజా అలరించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై  రాధాకృష్ణకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకర్‌తో పాటు హిందీ వెర్షన్‌కు మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీతం అందించనున్నారు.ఇటలీ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ను ఇటీవలే విడుదల చేశారు. అందులో ఒక రైల్వేస్టేషన్‌లో ప్రభాస్‌, పూజాకు లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌ ఉంటుంది. అయితే ఈ సన్నివేశాన్ని ముందుగా ఇటలీలోని ఒక రైల్వే స్టేషన్‌లో తీయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూట్‌ చెయ్యలేని పరిస్థితి. దీంతో చిత్రబృందం సెట్‌ వేయాలనే నిర్ణయానికొచ్చింది. అనుకున్నదే తడువుగా ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెట్‌ను నిర్మించారు. సుమారు 250 కార్మికులతో నెలరోజుల పాటు ఈ సెట్‌ను నిర్మించినట్టు ఆయన వెల్లడించారు. ఆ సెట్‌ ఖరీదు దాదాపు రూ.1.50 కోట్ల పైమాటేనని విశ్వసనీయ సమాచారం. ‘రాధేశ్యామ్‌’ జులై30న థియేటరల్లో ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని