అధిక బిల్లులేసిన ఆస్పత్రికి అనుమతి రద్దు - treatment permission cancelled for taking high fee from corona patients
close
Updated : 03/08/2020 20:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అధిక బిల్లులేసిన ఆస్పత్రికి అనుమతి రద్దు

హైదరాబాద్‌: కరోనా పేరుతో రోగులకు అధిక బిల్లులు వేస్తున్న ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా సోమాజిగూడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి కరోనా చికిత్స అందించే అనుమతిని రద్దు చేసింది. కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వేసి డబ్బులు లాగుతోందని ఈ ఆస్పత్రిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆస్పత్రికి కరోనా చికిత్స అనుమతి రద్దు చేయడంతోపాటు ఇకపై కొత్త కరోనా కేసులను చేర్చుకోవద్దని ఆదేశించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కార్యాలయం ఆ ఆస్పత్రికి నోటీసులు జారీ చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని