ఓటీటీలో త్రిష కొత్త చిత్రం - trisha paramapadham vilayattu on ott
close
Published : 04/04/2021 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో త్రిష కొత్త చిత్రం

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి త్రిష తన 60వ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దీనికి ‘పరమపాదం విలయట్టు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కె.తిరుజ్ఞానం దర్శకుడు. ఓ  విభిన్నమైన పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో     రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలోనే థియేటర్లలో విడుదల    చేయాలని భావించినా.. అనుకోని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.

ఇప్పుడీ సినిమాని తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్‌ 14న డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. దీంట్లో త్రిష ఓ ప్రముఖ రాజకీయ నేతకు చికిత్స అందించే వైద్యురాలిగా కనిపించనుందని సమాచారం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని