ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉండండి! - trivikram srinivas met young tiger ntr
close
Updated : 02/01/2021 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉండండి!

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఓ గుడ్‌న్యూస్‌ను అభిమానులు వినబోతున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్‌ కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని చెబుతూ, చిత్ర బృందం వారి ఫొటోలను పంచుకుంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ‘#NTR30’ అంటూ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ పేర్కొన్నారు.

ఇప్పటికే కథ ఓకే కాగా, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా అయిపోయినట్లు సమాచారం. ఈ సినిమాకు ‘అయిననూ హస్తినకు పోయి రావలె’ అనే టైటిల్‌ కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కలవడం ఆసక్తిని కలిగిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా న్యూస్‌ ఉంటుందని ఆశించిన అభిమానులు కాస్త నిరాశపడ్డారు. అయితే, సంక్రాంతి సందర్భంగా ఆ న్యూస్‌ చెబుతారా? లేదా? తెలియాలంటే ‘అయిననూ ఇంకొన్ని రోజులు వేచి చూడవలె’!. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కనుంది.

ఇవీ చదవండి..

‘గాజు ముక్క కూడా వేస్టే.. కానీ కంట్లో పడితే’

‘లూసిఫర్‌’ రీమేక్‌లో సత్యదేవ్‌..?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని