‘మీరు డాక్టర్‌ను కలిస్తే మంచిది’  - troll says madhavan is ruining his career with alc
close
Published : 06/01/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మీరు డాక్టర్‌ను కలిస్తే మంచిది’ 

ట్రోలర్‌కు మాధవన్‌ రిప్లై

చెన్నై:తమ అభిమాన తారలపై సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొందరు అభిమానం పేరిట నటులను ట్రోల్‌ చేస్తూ ఉంటారు. తాజాగా నటుడు మాధవన్‌ను ఒక అభిమాని ‘డ్రగ్‌ ఎడిక్ట్‌’అంటూ చేసిన కామెంట్‌కు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 
వివరాల్లోకి వెళితే.. సదరు నెటిజన్‌ ట్విట్టర్‌ వేదికగా ‘మాధవన్‌ ఒకప్పటి నా అభిమాన నటుడు కానీ ప్రస్తుతం ఆయన మద్యం, మాదక ద్రవ్యాలు సేవిస్తూ కెరీర్‌ నాశనం చేసుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఆయన నటించిన తొలి సినిమాలో ఎంతో ఆకర్షణీయంగా ఉండేవారు. ప్రస్తుతం అలా లేరు’అని రాసుకొచ్చారు. దీనికి మాధవన్‌ స్పందిస్తూ ‘ఈ కామెంట్‌ చూస్తుంటే మీకు అజీర్తి రోగం ఉందేమోనని నా సందేహం. మీ ఆనారోగ్యానికి నేను చాలా చింతిస్తున్నాను. కచ్చితంగా మీకు ఒక మంచి వైద్యుని అవసరం ఉంది’ అంటూ ఏడుస్తున్న ఎమోజీలను ఉంచారు. మాధవన్‌ స్పందనను చాలా మంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఆయన్ను సపోర్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మాధవన్‌ నటించిన ‘మార’ అనే తమిళ్‌ మూవీ జనవరి 8న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ఇవీ చదవండి!

‘ది రోజ్‌ విల్లా’భయపెడుతోంది!

‘మై నే ప్యార్‌కియా’లో నటించొద్దనుకున్నాను: భాగ్యశ్రీ

 
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని