పాకిస్థాన్‌ వర్షెన్‌ ‘మనీ హైస్ట్’‌.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌! - trolling on pakistan version money heist in social media
close
Published : 23/10/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాకిస్థాన్‌ వర్షెన్‌ ‘మనీ హైస్ట్’‌.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌!


(ఫొటో: ఫేసల్‌ ఖురేషి ఫేస్‌బుక్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలంతా కొన్ని నెలలపాటు కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే గడిపారు. ఆ సమయంలో సినిమాలు లేక యువత వెబ్‌సిరీస్‌లు చూడడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బాగా పాపులరైన వెబ్‌ సిరీస్‌ ‘మనీ హైస్ట్‌’. ఒక ప్రొఫెసర్‌ ఓ బృందంతో కలిసి స్పెయిన్‌లోని రాయల్‌మింట్‌లో ఎలా దోపిడీ చేశాడన్నది కథ. స్పానిష్‌లో ‘లా కాస డె పాపెల్‌’ పేరుతో 2017లో తీసిన ఈ వెబ్‌సిరీస్‌.. ఇంగ్లీష్‌లో ‘మనీ హైస్ట్‌’ పేరుతో డబ్‌ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. దీంతో ఈ వెబ్‌సిరీస్‌కు లాక్‌డౌన్‌ కాలంలో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ను పాకిస్థాన్‌లో రీమేక్‌ చేస్తున్నారు.

మనీ హైస్ట్‌ వెబ్‌సిరీస్‌ను పాకిస్థాన్‌ వర్షెన్‌లో ‘50 క్రోర్‌’ పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఇందులో పాక్‌ నటులు ఖురేషి, మహమూద్‌ అస్లాం, అయిజాజ్‌ అస్లాం, సబూర్‌ అలి, ఫర్యాల్‌ మహమూద్‌, ఝాలే సారాది, అసద్‌ సిద్ధిఖి, నొమన్‌ హబీబ్‌, నవీద్‌ రజా, ఒమర్‌ షాహజద్‌, అనౌషే అబ్బాసి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ నటులు ‘50 క్రోర్‌’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. దీంతో ‘మనీ హైస్ట్‌’ చూసిన నెటిజన్లు ‘50 క్రోర్‌’ సినిమాను ట్రోల్‌ చేస్తున్నారు. పాక్‌ వర్షెన్ టీజరే ఇంత హాస్యాస్పదంగా ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో అని నవ్వుకుంటున్నారు. ‘ఆ వెబ్‌సిరీస్‌ రేంజ్‌ ఏంటి? ఈ సినిమా రేంజ్‌ ఏంటి’?, ‘అది మనీ హైస్ట్‌.. ఇది మనీ వేస్ట్‌’, ‘ఆ మనీ హైస్ట్‌ 1080 పిక్సెల్‌ అయితే ఈ మనీ హైస్ట్‌(50క్రోర్‌ను ఉద్దేశించి) 240 పిక్సెల్‌’, ‘పాకిస్థాన్‌ వర్షెన్‌ మనీ హైస్ట్‌లో ఆ దేశంలో ఐటీలో డిగ్రీ పొందిన నిరుద్యోగే ఫ్రొఫెసర్‌ అయి ఉంటాడు’, ‘దోపిడీ చేసేది కేవలం 50 కోట్లేనా?’అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలా ప్రస్తుతం సోషల్‌మీడియాలో #50crore హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని