close

తాజా వార్తలు

Published : 22/02/2020 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలీవుడ్‌ సినిమాపై ట్రంప్‌ ట్వీట్‌

ఆయుష్మాన్‌ చిత్రాన్ని ప్రశంసించిన అమెరికా అధ్యక్షుడు

ముంబయి: తాజాగా విడుదలైన ఓ బాలీవుడ్‌ చిత్రంపై అమెరికా అధ్యక్షుడి దృష్టి పడింది. ఈ మేరకు ట్రంప్‌ సదరు బాలీవుడ్‌ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్‌ కూడా పెట్టారు. ‘అంధాధున్‌’ చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటించిన సినిమా ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’. స్వలింగ సంపర్కుల(గే) మధ్య ఉండే ప్రేమాభిమానులను గురించి తెలియజేసే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి హితేశ్‌ కేవల్యా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానాతోపాటు జితేంద్ర కుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది.

‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ సినిమా విడుదలను తెలియజేస్తూ ఇటీవల స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త పీటర్‌ టాట్చెల్‌ ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘స్వలింగ సంపర్కుల మధ్య ఉండే ప్రేమాభిమానులను తెలియజేసే విధంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా చూశాక స్వలింగ సంపర్కులపై ఉన్న చిన్నచూపు పోతుందని ఆశిస్తున్నాను’ అని పీటర్‌ టాట్చెల్‌ పేర్కొన్నారు. అయితే పీటర్‌ పెట్టిన ట్వీట్‌పై ట్రంప్‌ స్పందించారు. పీటర్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘గ్రేట్‌’ అని పేర్కొంటూ రిప్లై ఇచ్చారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.