రుచికే కాదు.. ఆరోగ్యానికీ ఈ పచ్చడి మంచిదే! - try this tasty and healthy coconut chutney in telugu
close
Published : 12/09/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుచికే కాదు.. ఆరోగ్యానికీ ఈ పచ్చడి మంచిదే!

‘ఇడ్లీ, వడ, ఊతప్పం... ఇలా ఏ బ్రేక్‌ఫాస్ట్‌కైనా పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌ ఏది?’ అని అడిగితే... చాలామంది ఠక్కున చెప్పే సమాధానం...కొబ్బరి చట్నీ. రుచితో పాటు తేలికగా జీర్ణమయ్యే ఈ పచ్చడిని దక్షిణ భారతదేశ ప్రజలు ఇష్టపడి తీసుకుంటుంటారు. వంటగదిలో ఉండే పదార్థాలతో సులభంగా తయారుచేసుకోవడం ఈ చట్నీకున్న మరో సానుకూలాంశం. అయితే కేవలం రుచికరంగా ఉండడమే కాదు.. దీనివల్ల ఆరోగ్యానికీ ఎన్నో ప్రయోజనాలున్నాయి.. మరి అవేమిటో తెలుసుకుందాం రండి..

ఆరోగ్య ప్రయోజనాలు

* కొబ్బరి పచ్చడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

* అజీర్తి, డయేరియా, మలబద్ధకం, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు తగ్గిపోతాయి.

* ఈ చట్నీలోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు కడుపులోని హానికారక క్రిములను నాశనం చేస్తాయి.

* రక్తపోటుతో బాధపడేవాళ్లు రెగ్యులర్‌గా ఈ పచ్చడిని తీసుకోవడం మంచిదట.

* రక్తంలో హెచ్‌డీఎల్‌ (మంచి కొవ్వులు), ఎల్‌డీఎల్ (చెడు కొవ్వులు) స్థాయులను సమతుల్యం చేయడంలో కొబ్బరి బాగా సహాయపడుతుంది. కాబట్టి కొబ్బరి చట్నీ లేదా కొబ్బరితో చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

* శరీరంలోని జీవక్రియల రేటు ఎక్కువగా ఉంటే త్వరగా బరువు తగ్గిపోవచ్చు. ఈ విషయంలో కొబ్బరి పచ్చడి సమర్థంగా పనిచేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీనిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

తయారీ విధానం

కావాల్సిన పదార్ధాలు

* కొబ్బరి కాయ- ఒకటి

* పచ్చి మిర్చి -3 నుంచి 4

* జీలకర్ర- అర టీస్పూన్

* జీడిపప్పు- 6 నుంచి 8

* ఉప్పు - రుచికి సరిపడినంత

* నిమ్మరసం

* అల్లం

తాలింపు కోసం

* కొబ్బరి లేదా రిఫైన్డ్ నూనె- 2 టేబుల్‌ స్పూన్లు

* ఆవాలు - ఒక టీస్పూన్

* మెంతులు- ఒక టీస్పూన్

* మినప్పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు

* శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూన్

* ఎండు మిరపకాయలు- 2

* కరివేపాకు

ఇలా చేయాలి..

కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, జీడిపప్పు, అల్లం, ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో నూనెను వేడి చేసి ఆవాలు, మెంతులు, మినప్పప్పు, శెనగపప్పు, ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్‌లోకి కొద్దిగా నిమ్మరసం, సగం తాలింపు మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్‌ చేయాలి. చివరిగా సర్వింగ్‌ బౌల్‌లో దీనిని వడ్డించుకుని మిగిలిన తాలింపుతో గార్నిష్‌ చేసుకుంటే రుచికరమైన కొబ్బరి చట్నీ రడీ!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని