ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసింది:హైకోర్టు - ts high court fired on govt due to insuffiecent info of corona
close
Updated : 20/07/2020 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసింది:హైకోర్టు

కరోనా పరిస్థితులపై విచారణ

హైదరాబాద్‌: తెలంగాణ కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బులిటెన్‌, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓ వైపు మొట్టి కాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని